King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...
king cobra attack: కింగ్ కోబ్రా పామును యువతి అత్యంత చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ అది పలు మార్లు ఆమెపైన దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Woman dangerous stunts with king cobra video: పాములలో కింగ్ కోబ్రా అత్యంత డెంజర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది గూడు కట్లుకుని పిల్లలను కాపాడుకుంటుంది. అంతే కాకుండా కింగ్ కోబ్రా ఇతర పాముల్ని అమాంతం దాడి చేసి తినేస్తుంది. ఇతర పాముల కాటుల కంటే కింగ్ కోబ్రా పాము విషం అత్యంత భయంకరమైందని, ఇది సెకన్ల వ్యవధిలోనే శరీరంపై పనిచేస్తుందని వెంటనే విగత జీవిగా మారిపోతారని చెప్తుంటారు.
అయితే కోబ్రా దాడి నేపథ్యంలో తరచుగా అనేక వీడియోలు నెట్టింట వైరల్గా మారుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కింగ్ కోబ్రాను యువతి అత్యంత ధైర్యంతో ఈజీగా పట్టుకుని స్టంట్ లు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఒక ఇంటి ఆవరణలో ఉన్న చెట్లలో కింగ్ కోబ్రా బైటకొచ్చింది. వెంటనే దాన్ని గుర్తించి ఇంట్లోని వారు స్నేక్ టీమ్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న టీమ్ లోని యువతి కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టునేందుకు ప్రయత్నించింది. అది దాదాపు 15 అడుగుల పొడవుంది. యువతి పలుమార్లు కోబ్రా కాటు నుంచి బైటపడింది. అయన కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.
పదే పదే కింగ్ కోబ్రాను తన ఆధీనంలో తెచ్చుకొవడానికి శాయ శక్తులా ప్రయత్నించింది. చివరకు పడగ విప్పి బుసలు కొడుతున్న కూడా కింగ్ కోబ్రాను తన స్వాధీనంలో తెచ్చుకుంది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ఏంట్రా ఆ ధైర్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.