• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

Mangli New Private Album Song: సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన గాత్రంతో తెలుగులో హుషారైన పాటలతో అలరిస్తోంది. కేవలం సినిమా పాటలతోనే కాదు.. హుషారెత్తే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌తో అలరిస్తోంది మంగ్లీ.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 05, 2026, 03:55 PM IST|Updated: Nov 05, 2026, 03:56 PM IST
joinshare
సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..
Image Credit: Mangli New Song (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

2

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

3

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

4

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

5

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mangli New Song: ప్రముఖ జానపద గాయని మాంగ్లీ తనదైన గాత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు. తెలుగులో ఎన్నో సినిమా పాటలు అలరించాయి.  కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు.. బోనాలు, మహా శివరాత్రి, దసరా, బతుకమ్మ  పాటలతో అలరించింది. ఆమె పాటకు ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈమె వార్నర్ మ్యూజిక్ ఇండియా రూపొందిస్తున్న ‘మాటి సీజన్ 2’లో భాగంగా ‘పోడా ఓ చందు’ అనే కొత్త తెలుగు జానపద గీతాన్ని పాడటంతో పాటు నటంచి మెప్పించారు.  ప్రేమలోని చిలిపితనం, ఆకర్షణ, మధురమైన అనుభూతులను ఈ పాటలో అందంగా తెరపై చూపించిన విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా,జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్,  స్థానిక వాయిద్యాలు, వేణువు, ఈలలతో పాటకు ప్రత్యేకమైన జానపద శోభను తీసుకొచ్చారు. మాంగ్లీ ఉత్సాహభరితమైన గాత్రం, ఆకట్టుకునే నృత్యరీతులు, కలర్‌‌ఫుల్ దృష్యాలతో ఈ  వీడియో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా మాంగ్లీ మాట్లాడుతూ..  కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోసిందని కొనియాడారు.  సురేష్ బొబ్బిలితో కలిసి పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందన్నారు. ఈ పాట దీపావళి  పండుగ వేళ ప్రేక్షకులను ఉత్సాహంగా నృత్యం చేసేలా చేస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రాంతీయ జానపద సంగీతంలోని సహజత్వాన్ని కాపాడుతూ ఉత్సాహభరితమైన బాణీని అందించినట్టు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తెలిపారు. ఈ పాట ప్రస్తుతం ప్రముఖ ఆడియో, వీడియో స్ట్రీమింగ్ దూసుకుపోతుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News