Red Rice Benefits: తెలుగువారి దైనందిన ఆహారంలో తెల్ల అన్నానిదే అగ్రస్థానం. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో వైట్ రైస్ లేకపోతే చాలామందికి తిన్న సంతృప్తి ఉండదు. అయితే, ఈమధ్య కాలంలో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ప్రజలు తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా ముడి బియ్యం, బ్రౌన్ రైస్, ఎర్ర బియ్యం వైపు అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిలోనూ ఎర్ర బియ్యం అత్యంత శక్తివంతమైన పోషకాహారంగా నిలుస్తోంది. అతిగా పాలిష్ చేయకపోవడం వల్ల దీనిలోని పీచు పదార్థం, సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు నశించకుండా భద్రంగా ఉంటాయి. తెల్ల అన్నంతో పోలిస్తే ఎర్ర బియ్యం తీసుకోవడం వల్ల శరీరానికి లభించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ఎర్ర బియ్యం ప్రత్యేకత:
ఎర్ర బియ్యం ప్రత్యేకత అనేది దాని రంగులోనే కాదు.. అందులో ఉండే పోషకాల్లోనూ ఉంటుంది. బియ్యం గింజపై ఉండే పొట్టు పొరలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పాలిష్ చేయని ఎర్రబియ్యంలో ఈ పోషకాలు కొంత వరకు నిల్వ ఉంటాయి. తెల్ల బియ్యాన్ని తయారు చేసే సమయంలో పై పొరలను తొలగించడం వల్ల వాటిలోని పైబర్, కొన్ని పోషకాలు తగ్గిపోతాయి. ఎర్ర బియ్యంలో ఉండే పీచు పదార్థం జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అయితే బియ్యం రకం, సాగు ప్రాంతం, పాలిషింగ్ స్థాయిని బట్టి పోషక విలువలనేవి మారుతుంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినేందుకు భయపడుతుంటారు. అలాంటి వారికి ఎర్ర బియ్యం ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఆహారంలోని కార్బొహైడ్రెట్లు శరీరంలో శోషించుకుని వేగాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. దీంతో భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కొంత వరకు కంట్రోల్లో ఉంటుంది. ఎర్ర బియ్యంలో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే ఎర్ర బియ్యం తిన్నంత మాత్రాన షుగర్ తగ్గిపోదు. బియ్యం రకాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తినే పరిమాణంపై తప్పకుండా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రయోజనకరమా?
బరువు తగ్గాలనుకునే వారికి అధిక ఫైబర్ ఉన్న ఆహారం చాలా ముఖ్యం. ఎర్ర బియ్యంలోని ఫైబర్ మీకు త్వరగా కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది. ఇది ఆకలిని తగ్గించి, ఆహార తీసుకోవడాన్ని నియంత్రించగలదు. ఇది బరువు తగ్గే ప్రయత్నాలకు దోహదపడుతుంది. అంతేకాకుండా, ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అయితే, ఎర్ర బియ్యంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా ఉంటాయి. దీనిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, మీ రోజువారీ ఆహారంలో తగినంత పరిమాణంలో కూరగాయలు, పప్పులు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం ముఖ్యం.
ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది:
ఎర్ర బియ్యంలోని ఫైబర్, ఫినాలిక్ సమ్మేళనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా, ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు పాలిష్ చేసిన ధాన్యాల కంటే తక్కువ ప్రాసెస్ చేసిన సంపూర్ణ ధాన్యాలను ఎంచుకోవాలి. అయితే, ఎర్ర బియ్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుందని చెప్పడానికి తగినంత ఆధారాలు లేవు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరైన బరువు నిర్వహణ కూడా అంతే ముఖ్యం.
ఎర్ర బియ్యం తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఎర్ర బియ్యం ఆరోగ్యానికి మంచిది. కానీ మీరు దానిని అతిగా తినకూడదు. మధుమేహం, అధిక బరువు ఉన్నవారు ముఖ్యంగా బియ్యం వినియోగాన్ని నియంత్రించుకోవాలి. ఒకే పూట భోజనంలో అన్నంతో పాటు ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పప్పులు, పెరుగు ఉండాలి. వండటానికి ముందు ఎర్ర బియ్యాన్ని కొన్ని గంటల పాటు నానబెట్టడం వల్ల అది సులభంగా ఉడుకుతుంది. మధుమేహం కోసం మందులు తీసుకుంటున్న వారు, ఆహారంలో పెద్ద మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: