Woman injured after she blast crackers near her stomach Video: ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది రీల్స్ ముసుగులో నానా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యూస్ లు, లైక్ లు టార్గెట్ గా తమ పైత్యం చూపిస్తున్నారు. కొంత మంది తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ పట్టాల మీద, జంతువుల వద్దకు వెళ్లి ప్రమాదకర స్టంట్ లతో రీల్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు వీరి రీల్స్ పిచ్చి కాస్త వారి ప్రాణాల మీదకు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో దీపావళి పండగ జరిగింది. ఒక మహిళ తన పొట్టపై టపాసు పెట్టుకుని రీల్స్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నాభి దగ్గర టపాసు వెలిగించి ప్రమాదంలో చిక్కుకున్న మహిళ దీపావళి వేడుకల్లో భాగంగా ఓ మహిళ తన నాభి దగ్గర వెలిగించిన బాణసంచా పెట్టుకుంది. ఒక్కసారిగా ఎర్రటి నిప్పురవ్వలు పొట్టపైకి దూసుకురావడంతో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వైద్యుల అంచనాల ప్రకారం దీపావళి తర్వాత బాణసంచా ప్రమాదాల కారణంగా భారత్‌లో ఏటా 10 వేల మందికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రులకు వస్తున్నట్లు సమాచారం. #Diwali #FirecrackerAccident #BurnInjuries #IndiaNews
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 12, 2026
ఒక మహిళ దీపావళి పండగ వేళ తన పైత్యంను కాస్తంతా వెరైటీగా చూపించింది. టపాకాయల్ని రోటీన్ కు భిన్నంగా కాల్చింది. అందరు టపాకాయాల్ని రోడ్డు మీద, ఇంటి ముందు వెలిగిస్తారు. చాలా జాగ్రత్తగా టపాకాయలు కాలుస్తారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వెలిగించిన కూడా ప్రమాదంలో పడతారు. ఈ క్రమంలో పెద్దలు కూడా టపాకాయలు కాలుస్తుండగా పిల్లల దగ్గరే ఉంటారు. ఇక్కడొక మహిళ మాత్రం ఏ మాత్రం భయంలేకుండా తన పొట్ట వద్ద టపాకాయాల్ని పెట్టి కాల్చింది. నాభి వద్ద టపాసు పెట్టి ఏమాత్రం భయం లేకుండా పేల్చింది. దీంతో వెలుగులు విరజిమ్ముతు టపాసు పేలిపోయింది.
వెంటనే అదేదో ఘనకార్యం చేసినట్లు సదరు మహిళ నవ్వుతూ కాస్తంతా వెరైటీ తన పైత్యం చూపింది. ఈ ఘటన తర్వాత మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. తనపైత్యంను వీడియో కూడా తీసుకుంది. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. నాభి వద్ద టపాసు పెట్టడం ఏంట్రా బాబు, పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.