• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రేపు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్తున్నారా? ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా? కస్టమర్లు ఇవి గమనించండి!

రేపు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్తున్నారా? ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా? కస్టమర్లు ఇవి గమనించండి!

రేపు బ్యాంక్ పనిపై మీ బ్రాంచ్‌లకు వెళ్తున్నారా? అయితే, శుక్రవారం నవంబర్‌ 13 ఏ బ్యాంకు బ్రాంచీలు పనిచేయడం లేదు తెలుసా? ఆర్‌బీఐ ప్రకారం ఈ సెలవు వర్తిస్తుంది. ప్రధానంగా ఈ సెలవు ఎక్కడ? ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 12, 2026, 03:01 PM IST|Updated: Nov 12, 2026, 03:04 PM IST
joinshare
రేపు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్తున్నారా? ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా? కస్టమర్లు ఇవి గమనించండి!
Image Credit: Bank Holiday News:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఇక వారానికి రెండు రోజులు సెలవులు?

School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఇక వారానికి రెండు రోజులు సెలవులు?

2

Tanishq Jewellery Theft: తనిష్క్‌ జ్యువెలరీలో భారీ దొంగతనం.. 16 కిలోల బంగారం చోరీ

3

Sekhar Master: అయ్యప్పస్వామి దయ వల్ల బైటపడ్డాం.. రోడ్డు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ క్లారిటీ.. వీడియో ..

4

Mumbai Indians New Captain: హార్దిక్ పాండ్యా అవుట్? ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మేనా?

5

Karthika masam: కార్తీక మాసంలో భార్య భర్తలు సంభోగంలో పాల్గొనవచ్చా..?.. అసలు నిజం ఏమిటంటే .!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bank Holiday News: ఏవైనా పెద్ద డిపాజిట్స్‌, చెక్స్‌, విత్‌డ్రాయల్స చేయాలంటే మాత్రం కచ్చితంగా బ్యాంక్‌ బ్రాంచీలకు వెళ్లాల్సిందే. అయితే, మీ బ్యాంకు బ్రాంచీ పనిచేస్తుందా? లేదా? అని చెక్‌ చేసుకుని వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడతారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం కొన్ని సెలవులు వర్తిస్తాయి. కొన్ని స్థానిక పండుగలు మాత్రమే కాదు.. రెండో, నాలుగో శనివారాలు, ప్రతి ఆదివారాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకు బ్రాంచీలు పనిచేయవు. ఇది ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. అయితే, రేపు నవంబర్‌ 13వ తేదీ శుక్రవారం ఏ బ్యాంక్‌ బ్రాంచీలు బంద్‌ ఉంటాయి.

నవంబర్‌ 13వ తేదీ శుక్రవారం మేఘాలయాలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు బంద్‌ఉంటాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాం్‌, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. మేఘాలయాలో శుక్రవారం వంగల ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

వంగల పండుగ అంటే మేఘాలయ రాష్ట్రంలో ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఇక్కడ పంట చేతికి వస్తుంది. దీంతో గారో కమ్యూనిటీ ప్రజలు ఈ వేడుక చేస్తారు. దీన్ని 100 డ్రమ్స్‌ ఫెస్టివల్‌ అని కూడా పిలుస్తారు. ఇది గారో ప్రజల పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఇది ఒక వ్యవసాయ సాంప్రదాయబద్ధమైన పండుగ. పంట చేతికి వచ్చినందుకు సూర్య దేవుడికి కృతజ్ఞతగా నిర్వహించే వేడుక

ఈ వంగల ఫెస్టివల్‌ గారో హిల్స్‌ ప్రాంతాల్లో జరుపుకొంటారు. రాగులతో వేడుక ప్రారంభం అవుతుంది. గ్రామ పెద్ద ఇంట పూజలు చేస్తారు. గ్రామస్థులు కూడా పెద్ద ఎత్తున ఈ వేడకకు రంగురంగుల దుస్తులు ధరించి  వస్తార. ప్రధానంగా తమ సంప్రదాయ దుస్తులు తల నుంచి కాళ్ల వరకు ధరిస్తారు. డ్రమ్ములు వాయిస్తూ ఫోక్‌ డ్యాన్స్‌ చేస్తారు.

Read Also:  నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!
Read Also: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
 

కేవలం మేఘాలయాలోనే ఈ బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ హరియాణ, సిక్కిం, మణిపూర్‌, వెస్ట్‌ బెంగాళ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, తెలుగు రాష్ట్రాల్లో కూడా యథావిధిగా పనిచేస్తాయి.

నవంబర్‌ 14 రెండో శనివారం బ్యాంకు బంద్‌ ఉంటాయి. ఆ మరుసటి రోజు 15 ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు పనిచేయవవు. ఇక నవంబర్‌ 16వ తేదీ ఛత్‌ పూజ సందర్భంగా బిహార్‌, జార్ఖంఢ్‌  ప్రాంతాల్లో బంద్ ఉంటాయి. ఇక్కడ సూర్యుడు, ఛతీకి పూజలు చేస్తారు. నవంబర్‌ 20 ఉత్తరాఖండ్‌లో బంద ఇక్కడ ఇగస్‌ బగ్వాల్‌ ఉంది. ఇది ఒక లోకల్‌ ఫెస్టివల్‌. నవంబర్‌ 23వ తేదీ సెంగ్‌ కుట్‌ స్నెమ్‌ ఫెస్టివల్ ఉంది. మేఘాలయాలో మాత్రమే బ్యాంకులు బంద్‌ ఉంటాయి. నవంబర్‌ 24వ తేదీ ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Bank Holiday
Reserve Bank of India
National News
Festivals