SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. నాభిలో టపాసుపెట్టి వెలిగించుకున్న మహిళ.. వీడియో వైరల్..

Woman Diwali reels video: మహిళ తన పొట్ట దగ్గర టపాసు పెట్టి వెలిగించింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియోపై నెట్టింట దుమారం చెలరేగింది. ఇలాంటి పనులతో ఏం మెస్సెజ్ ఇస్తున్నారంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 12, 2026, 02:24 PM IST | Updated: Nov 12, 2026, 02:33 PM IST
Image Credit: Woman reels with crackers video viral
Join

Woman injured after she blast crackers near her stomach Video: ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది రీల్స్ ముసుగులో నానా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యూస్ లు, లైక్ లు టార్గెట్ గా తమ పైత్యం చూపిస్తున్నారు. కొంత మంది తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ పట్టాల మీద, జంతువుల వద్దకు వెళ్లి ప్రమాదకర స్టంట్ లతో రీల్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు వీరి రీల్స్ పిచ్చి కాస్త వారి ప్రాణాల మీదకు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో  దీపావళి పండగ జరిగింది.  ఒక మహిళ తన పొట్టపై టపాసు పెట్టుకుని రీల్స్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

 

 


ఒక మహిళ దీపావళి పండగ వేళ తన పైత్యంను కాస్తంతా వెరైటీగా చూపించింది. టపాకాయల్ని రోటీన్ కు భిన్నంగా కాల్చింది.  అందరు  టపాకాయాల్ని రోడ్డు మీద, ఇంటి ముందు వెలిగిస్తారు. చాలా జాగ్రత్తగా టపాకాయలు కాలుస్తారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వెలిగించిన కూడా ప్రమాదంలో  పడతారు. ఈ క్రమంలో పెద్దలు కూడా టపాకాయలు కాలుస్తుండగా పిల్లల దగ్గరే ఉంటారు. ఇక్కడొక మహిళ మాత్రం ఏ మాత్రం భయంలేకుండా తన పొట్ట వద్ద టపాకాయాల్ని పెట్టి  కాల్చింది. నాభి వద్ద టపాసు పెట్టి ఏమాత్రం భయం లేకుండా పేల్చింది. దీంతో వెలుగులు విరజిమ్ముతు టపాసు పేలిపోయింది. 

వెంటనే అదేదో ఘనకార్యం చేసినట్లు సదరు మహిళ నవ్వుతూ కాస్తంతా వెరైటీ తన పైత్యం చూపింది. ఈ ఘటన తర్వాత మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. తనపైత్యంను వీడియో కూడా తీసుకుంది. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. నాభి వద్ద టపాసు పెట్టడం ఏంట్రా బాబు, పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES