• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Mumbai Indians New Captain: హార్దిక్ పాండ్యా అవుట్? ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మేనా?

Mumbai Indians New Captain: హార్దిక్ పాండ్యా అవుట్? ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మేనా?

Mumbai Indians Captain 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా టీమ్‌ నుంచి ట్రేడ్ అయిన క్రమంలో ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి.

Written ByHarish Darla
Published: Nov 12, 2026, 04:12 PM IST|Updated: Nov 12, 2026, 04:21 PM IST
joinshare
Mumbai Indians New Captain: హార్దిక్ పాండ్యా అవుట్? ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మేనా?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
1300 Dharani Rice In AP: సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.1,300కే 26 కేజీల బియ్యం బస్తా!

1300 Dharani Rice In AP: సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.1,300కే 26 కేజీల బియ్యం బస్తా!

2

కొరియా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందో తెలుసా? మెనూ చూస్తే వావ్ అంటారు..!!

3

IPS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. సజ్జనార్‌ స్థానంలో మహేశ్‌ భగవత్‌

4

‘రామాయణ’ పేరిట మరో రేర్ ఫీట్.. ఫస్ట్ వీక్ ఇండియన్ సినిమాల్లో అరుదైన ఘనత..

5

School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఇక వారానికి రెండు రోజులు సెలవులు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mumbai Indians Captain 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. హార్దిక్ పాండ్యా జట్టును వీడిన క్రమంలో తదుపరి సారథి ఎవరనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందన్న దానిపై క్రీడా వర్గాల్లో చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రేసులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. సూర్యకుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం ఉన్నప్పటికీ, ముంబై జట్టు దీర్ఘకాలిక ప్రణాళికలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. మరోవైపు బుమ్రా జట్టులో కీలక బౌలర్ కావడంతో, అతడిపై కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా ఉంచడం సరైన నిర్ణయమా అనే చర్చ కూడా ఉంది.

ఇక యువ ఆటగాడు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో నిలకడ, జట్టుతో ఉన్న అనుబంధం అతడికి అనుకూల అంశాలుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడే కెప్టెన్సీ అప్పగిస్తే ఒత్తిడి పెరిగి అతడి ఆటతీరుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ముంబై యాజమాన్యం మరో వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 2027 సీజన్‌కు మాత్రమే రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ అప్పగించి, అతడి అనుభవం, మార్గదర్శకత్వంలో తిలక్ వర్మను భవిష్యత్ సారథిగా సిద్ధం చేయాలనే ఆలోచన ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదన అమలైతే 2028 సీజన్ నుంచి తిలక్‌కు నాయకత్వ బాధ్యతలు దక్కవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే రోహిత్ శర్మ ఈ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారా లేదా అన్నది కీలకం. ఆయన అంగీకరించకపోతే తిలక్ వర్మకు ముందుగానే అవకాశం దక్కే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి హార్దిక్ పాండ్యా భవిష్యత్తు, రోహిత్ శర్మ నిర్ణయం, తిలక్ వర్మకు దక్కే అవకాశం.. ఈ మూడు అంశాలే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎంపికలో కీలకంగా మారనున్నాయి. ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను ఊహాగానాలుగానే చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
IPL
Cricket
Sports News
Telugu News