SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bihar: వామ్మో.. భర్త డబ్బులతో కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

Woman kills husband in bihar: బీహర్ లో పాట్నాలో ఉండే ఇర్ఫాన్ ఇమామ్, ఫౌజియా ఫిర్దోస్‌లకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. భర్త ఇర్ఫాన్ డ్రైవర్ గా ఉంటూ కుటుంబంకు దూరంగా ఉండటం వల్ల ఇంటి దగ్గర ఉండే కరణ్ కుమార్ తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. దీంతో భర్త తరచుగా అడ్డు వస్తున్నాడని ఫౌజియా భర్తను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది.

Written By Inamdar Paresh
Published: Nov 25, 2026, 16:39 IST | Updated: Nov 25, 2026, 16:45 IST
Image Credit: woman kills her husband in bihar(file)
Join

Woman kills her husband with boy friend in bihar:  సమాజంలో ఇటీవల కొంత  మంది భార్యభర్తలు మరీ దారుణంగా తయారయ్యారు. ప్రతి చిన్న విషయాల్ని పెద్దది చేసుకుని విడాకుల వరకు వెళ్లిపోతున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని పిల్లలున్న కూడా కట్టుకున్న వారిని కాటికి పంపు తున్నారు.  ఇలాంటి వారి వల్ల పెళ్లి అనే పవిత్ర బంధం అభాసుపాలౌతుంది. ఈ క్రమంలో బీహర్ లోని పాట్నాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

బీహార్ లోని పాట్నాలో  సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది.  స్థానికంగా  బిహ్‌తా పీఎస్ పరిధిలో ఉన్న సిమ్రి గ్రామంలో ఇర్ఫాన్ ఇమామ్,  ఫౌజియా ఫిర్దోస్‌ దంపతులు ఉంటున్నారు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇర్ఫాన్ ఇమామ్ కుటుంబంకు దూరంగా ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో ఫౌజియా ఫిర్దోస్ కు కరణ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది.

 ఈ విషయం కాస్త భర్త ఇర్ఫాన్ కు తెలిసింది. దీంతో తరచుగా వీరి మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల వీరి మధ్య గొడవలు కాస్త పీక్స్ కు చేరడంతో  భర్తను లేపేయాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అందుకోసం భర్త అకౌంట్ నుంచి డబ్బులు తీసి సుపారీ గ్యాంగ్ కు ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. అప్పటికే ఫౌజియా తన పుట్టింటి వెళ్లి , భర్త ఇంట్లో ఒక్కడే ఉన్నాడని సుపారీ గ్యాంగ్ కు హింట్ ఇచ్చింది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం.. కాంట్రాక్ట్ కిల్లర్లు ఇర్ఫాన్  ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చి చంపారు.  ఆ తర్వాత అక్కడి నుంచి  పరారయ్యారు. 

స్థానికుల సమాచారంలో పోలీసులు రంగంలోకి విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ఫౌజియాపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు పరారీలో ఉన్న కిల్లర్ గ్యాంగ్ కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES