SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మె.. 110 కేజీల భారీ మొసలిని ఒళ్లోకి ఎత్తుకుని ఆడుకుంటున్న మహిళ!

Crocodile Viral Video: ఓ మహిళ 110 కేజీల భారీ మొసలిని ఒళ్లోకి ఎత్తుకుని ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌ అవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 30, 2026, 02:39 PM IST | Updated: Sep 30, 2026, 02:42 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Crocodile Video: తాజాగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల, వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, కొన్ని దృశ్యాలు మాత్రం చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తూ వస్తున్నాయి. మొసలి పేరు వింటేనే చాలా మంది అటు సైడ్‌ వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. అలాంటి ఏకంగా 110 కిలోల బరువున్న భారీ మొసలిని ఒళ్లోకి ఎత్తుకుని.. ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో చక్కర్లు కొడుతూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వైల్డ్‌ పార్కులో పని చేసే మహిళ ఉండడం మీరు చూడొచ్చు.. మొసళ్లు ఉండే ఎన్‌క్లోజర్‌లో ఎలాంటి భయం లేకుండా వెళ్లి..దాదాపు  110 కేజీలకు పైగా బరువు ఎన్న క్రూర జంతువును ఏమాత్రం భయం లేకండా ఎంతో నైపుణ్యంతో సులభంగా పైకి లేపి.. తన ఒడిలోకి తీసుకుని అటుఇటు తిరిగడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. సాధారణంగా మొసలి దవడల బలానికి పెద్ద పెద్ద జంతువులు సైతం ముక్కలైపోతూ ఉంటాయి. అలాంటి ప్రాణాంతకమైన జీవిని ఆమె పసిపిల్లాడిలా ఎంతో ముద్దుగా తన చేతులతో పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఇది పోస్ట్ చేసి చాలా రోజులవుతున్న.. ఇప్పుడు మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోకు వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. ఇందులో ఇంతటి భారీ మొసలిని ఇలా ఎత్తుకోవడం నా జీవితంలో చూడలేదని చాలా మంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఇక మరికొంతమంది ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కూడా భారీ మొత్తంలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను చూసిన వైల్డ్‌లైఫ్ నిపుణుల కూడా ఆ యుతిని హెచ్చరిస్తూ వస్తున్నారు.  ఇలాంటి దృశ్యాలు ఎంత వైరల్ అయినప్పటికీ, సాధారణ ప్రజలు వీటి పట్ల దూరంగా ఉండాలని.. తప్పకుండా ఇలా మొసళ్లు కనిపిస్తే దూరంగా ఉండాలని వారు హెచ్చరిస్తూ వస్తున్నారు.. వీడియోలోని మహిళ వైల్డ్‌లైఫ్ విభాగంలో ప్రత్యేక శిక్షణ కలిగి ఉన్నది కాబట్టి.. ఆమె ఆ మోసళ్లను పట్టుకుందని.. వారు తెలుపుతున్నారు. సాధారణంగా ప్రజలు మాత్రం ఇలా చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES