Woman marries man she tied rakhi to for 15 years in prayagraj: ఇటీవల సమాజంలో కొంత మంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మర్చిపోయి నీచంగా ప్రవర్తిస్తున్నారు. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే పవిత్ర బంధానికి మాయనిమచ్చగా మారుతున్నారు. ఇప్పటి వరకు మనం ఒకే కులాల మధ్యన పెళ్లిళ్లు చూశాం. ఆ తర్వాత ఇతర కులాల వారుకూడా పరస్పరం అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఇవన్ని మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ కొంత మంది సోదరులుగా భావించి కొన్నేళ్ల పాటు రాఖీలు కట్టి ఆతర్వాత వారినే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్ లో వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికంగా రచ్చ నడుస్తొంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల నందనీ పాండే.. గత 15 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల శాశ్వత్ గుప్తాను సొంత సోదరుడిలా భావిస్తుంది. ప్రతి రాఖీ పండగకు రాఖీ కడుతుంది. వీరిద్దరు చాలా క్లోజ్ గా ఉండే వారు. అయితే.. రాఖీ కట్టడంతో ఇతరులు వీరిపై పెద్దగా అనుమానంపడేవారు కాదు.
కానీ ఇటీవల వీరిద్దరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. గత పదిహేనేళ్లుగా రాఖీ కడుతున్న సోదరుడితోనే యువతి పారిపోయింది. అతడిని గుడిలో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. తమకు ప్రాణహని ఉందని ఈ జంట పోలీసులను ఆశ్రయించారు.
దీంతో యువతి కుటుంబ సభ్యులు దీనిపై గొడవకు దిగారు. కోపంతో తమ పరువు తీసిందని ఆమెకు కర్మకాండలు కూడా నిర్వహించారు. మరోవైపు యువతి మాత్రం పరస్పరం అంగీకారంతో తాము ఈ పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది.
ఇంట్లో డబ్బులు, బంగారం మాయం..
తమ ఇంటిలోని డబ్బులు, బంగారం తీసుకుని నందనీ పాండే పారిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక యువతి మాత్రం తనను కుటుంబ సభ్యులు పట్టించుకునే వారు కాదని, అందుకే వెళ్లిపోయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడినట్లు నందనీ పాండే చెప్పుకొచ్చింది.
దీనిపై గత కొన్నేళ్లుగా వీరి మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తుందని అందుకే వారు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.