SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వధూవరులను ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ మహిళల డ్యాన్స్.. వీడియో వైరల్!

Women Lifting Bride And Groom Video: తాజాగా సోషల్ మీడియాలో వధూవరులను ఎత్తుకుని మహిళలు చేస్తున్న డ్యాన్స్‌ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బ్యాండ్‌ చప్పుడులకు మహిళలు డ్యాన్స్‌ చేయడం చూసి సోషల్‌ మీడియా వినియోగదారులు ఆశ్యర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 03:54 PM IST | Updated: Nov 06, 2026, 03:56 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Women Lifting Bride And Groom Video: భారతీయుల పెళ్లిల్లో డ్యాస్సులతో పాటు చిన్నపిల్లలు చేసే అల్లరి పనులు సర్వసాధారణం.. అయితే, సాధారణంగా స్నేహితులు, బంధువులు కలిసి DJ లేదా బ్యాండ్‌ చప్పుడుల ముందు డ్యాన్స్‌ చేస్తూ ఉంటారు. కానీ ఇందుకు పూర్తిగా భిన్నంగా.. ఏకంగా నూతన వధూవరులను ఒళ్లోకి ఎత్తుకుని.. మహిళలు ఎంతో ఆనందంగా డ్యాన్స్‌ చేసిన వినూత్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే, ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్‌లో @sadiaislamparvin అనే ఖాతా నుంచి పోస్ట్ చేయబడిన ఈ వీడియోలో సందడితో పెళ్లి వాతావరణం కనిపించడం మీరు చూడోచ్చు.. బంధుమిత్రులు అంతా చుట్టూ చేరి ఉత్సాహంగా చూస్తుండగా.. బ్యాండ్‌ సౌండ్‌ మధ్య అందరూ నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే, ఇదే సమయంలో ఇద్దరు మహిళలు వేదిక మధ్యలోకి రావడం మీరు గమనించవచ్చు. అందులో ఒక మహిళ ఎరుపు.. గులాబీ రంగు చీర ధరించి సంప్రదాయ ముస్తాబులో ఉన్న పెళ్లికూతురిని ఎత్తుకోగా.. మరొక మహిళ గోల్డెన్ కలర్‌ కుర్తా ధరించిన పెళ్లికొడుకును ఎత్తుకుని ఉండడం మీరు గమనించవచ్చు. అలా వధూవరులను మోస్తూనే.. ఆ మహిళలిద్దరూ గిరగిరా తిరుగుతూ డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టారు. చుట్టూ ఉన్న చిన్నపిల్లలు.. పెద్దలు చూస్తూ ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇది ఏ ప్రాంతపు సంప్రదాయం? అంటూ అనేకమంది ఆశ్చర్యం వ్యక్తం కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇది బెంగాలీ వివాహాల్లో కనిపించే ఒక అరుదైన ఆచారమని కామెంట్లు రాస్తూ వస్తున్నారు.. మరికొందరు సంథాల్ గిరిజన తెగల వివాహ సంస్కృతిలో ఇలాంటి సంప్రదాయాలు ఉంటాయని అంటూ కామెంట్లు రాస్తున్నారు..

ఇక మరికొంతమంది పెళ్లిజంటను అంత సునాయాసంగా ఎత్తుకుని డ్యాన్స్‌ చేసిన ఆ మహిళల శారీరక బలాన్ని సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. వధూవరులు కాస్త బరువు ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏమయ్యేదో!.. అంటూ కొందరు తమ ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేస్తూ .. మన పెళ్లికి కూడా ఇలాంటి డ్యాన్స్ ప్లాన్ చేయాలి.. అంటూ సరదాగా పోస్టులు పెడుతూ వస్తున్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES