• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Xiaomi 18 Pro Series: 200MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ.. Xiaomi కొత్త ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు!

Xiaomi 18 Pro Series: 200MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ.. Xiaomi కొత్త ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు!

Xiaomi 18 Pro: మార్కెట్‌లోకి షియోమీ 18 సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత హైపర్‌ఓఎస్ 4 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 11:00 AM IST|Updated: Nov 10, 2026, 11:01 AM IST
joinshare
Xiaomi 18 Pro Series: 200MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ.. Xiaomi కొత్త ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నిద్రలేచాక ఎన్ని గంటల్లో బ్రేక్ ఫాస్ట్  తినాలి?.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలివే..!!

నిద్రలేచాక ఎన్ని గంటల్లో బ్రేక్ ఫాస్ట్ తినాలి?.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలివే..!!

2

Vivo నుంచి 12,000mAh బ్యాటరీ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల పాటు నో టెన్షన్!

3

Xiaomi 18 Pro Series: 200MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ.. Xiaomi కొత్త ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు!

4

హైదరాబాద్‌ను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచు.. అనూహ్యంగా మారిన ఉష్ణోగ్రతలు.. ఐఎండీ అలెర్ట్‌!

5

ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Xiaomi 18 Pro: ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ షియోమీ 18 ప్రో సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది.. ఇటీవల చైనాలో లాంచ్ అయ్యి.. విశేషమైన ఆదరణ కూడా దక్కించుకున్న ఈ సిరీస్‌ను అంతర్జాతీయ వినియోగదారుల కోసం అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లైనప్‌లో భాగంగా షియోమీ 18 ప్రో, షియోమీ 18 ప్రో మ్యాక్స్ అనే రెండు మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో అందించిన సమాచారం ప్రకారం.. నవంబర్ 17వ తేదీన ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. వెనుక వైపులో కూడా అద్భుతమైన సెకండరీ డిస్‌ప్లేతో పాటు ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో లైకా భాగస్వామ్యంతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా డ్యూయల్ 200 మెగాపిక్సెల్ సెన్సార్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. గ్లోబల్ వేరియంట్లు కూడా చైనీస్ మోడల్ తరహా స్పెసిఫికేషన్లతోనే అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం..

ఈ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా వెనుక ప్యానెల్‌పై నోటిఫికేషన్లతో పాటు, సెల్ఫీ ప్రివ్యూల కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌తో 2.7-అంగుళాల అమోలెడ్ సెకండరీ స్క్రీన్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 17 ఆధారిత హైపర్‌ఓఎస్ 4 (HyperOS 4) ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో లాంచ్‌ కానుంది. ఇందులో 16GB వరకు ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది OIS సపోర్ట్‌తో 200MP మెయిన్ సెన్సార్‌తో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో చాలా ప్రత్యేకమైన ట్రిపుల్ రియర్ కెమెరా సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం.. 50MP ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ డివైజ్‌లో 7,000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది..

ఈ సిరీస్‌లోని షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9-అంగుళాల భారీ ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. వెనుక వైపు 2.9-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే కూడా లభించబోతోంది. ఈ మోడల్  స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. ఇందులోనూ 16GB ర్యామ్‌తో పాటు 1TB స్టోరేజ్, హైపర్‌ఓఎస్ 4తో పాటు 200MP కెమెరా, అదనంగా.. 200MP కెమెరా, 50MP రియర్ కెమెరాతో పాటు 50MP ఫ్రంట్ కెమెరా సెటప్ అందించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News