• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత క్రమంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Written ByRenuka Godugu
Published: Nov 10, 2026, 10:43 AM IST|Updated: Nov 10, 2026, 10:52 AM IST
joinshare
ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?
Image Credit: IMD Issues Heavy Rain Alert:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నిద్రలేచాక ఎన్ని గంటల్లో బ్రేక్ ఫాస్ట్  తినాలి?.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలివే..!!

నిద్రలేచాక ఎన్ని గంటల్లో బ్రేక్ ఫాస్ట్ తినాలి?.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలివే..!!

2

Vivo నుంచి 12,000mAh బ్యాటరీ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల పాటు నో టెన్షన్!

3

Xiaomi 18 Pro Series: 200MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ.. Xiaomi కొత్త ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు!

4

హైదరాబాద్‌ను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచు.. అనూహ్యంగా మారిన ఉష్ణోగ్రతలు.. ఐఎండీ అలెర్ట్‌!

5

ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IMD Issues Heavy Rain Alert: అల్పపీడనం ఏర్పడిన అనంతరం అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 17 నాటికి ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు చేరువయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణం మారి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరోమారు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

ఇటీవల కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను రెండు తుఫానులు దంచికొట్టాయి. ఒకటి అర్ణబ్, రెండోది మురుసు తుఫాను. ఈ రెండు తుఫానుల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అర్ణబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు ఆరు, ఏడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ వంటి జిల్లాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనంతరం నాలుగు రోజుల వ్యవధిలో వచ్చిన మురుసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా నెల్లూరు, నరసాపురం మధ్య ఒంగోలు ప్రాంతంలో మురుసు తుఫాను తీరం దాటిన సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో ఈదురు గాలుల ధాటికి వేలాది వృక్షాలు నేలకూలాయి.

ఇప్పుడు మరోమారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, యానం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఇది క్రమంగా బలపడేందుకు ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన మోడళ్లను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయో ఆ ప్రాంతాల్లోని అధికార యంత్రాంగానికి వాతావరణ శాఖ ఇప్పటికే పలు కీలక సూచనలు చేసింది.

ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో నవంబర్ 17వ తేదీ నాటికి ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక.. మరోసారి ఈదురుగాలులతో వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
 

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు నమోదవుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా కురిసిన అతి భారీ వర్షాల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా రహదారులపైనే ఉండిపోయింది. నదులన్నీ ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా నేలమట్టమైంది. మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, ఏపీ, తెలంగాణ, యానం ప్రాంతాలకు వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం వాతావరణ మార్పులతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితులు, గాలి వేగాన్ని బట్టి తుఫానుగా మారుతుందా లేదా అనే అంశంపై కూడా అధికారులు ఇంకా ఒక అంచనాకు రాలేదు. అయితే మొత్తంగా 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో పాటు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గతంలో అర్ణబ్, మురుసు తుఫానులకు ముందు సెప్టెంబర్ నెలలో వచ్చిన అతి తీవ్ర వాయుగుండ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురిశాయి, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అర్ణబ్ తుఫాను ప్రభావంతో 54 రైళ్లను అధికారులు నిలిపివేశారు. మురుసు తుఫాను ప్రభావంతో నాలుగు, ఐదు రైల్వే స్టేషన్లు పూర్తిగా నీటమునగడంతో రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విస్తారమైన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దాదాపు నాలుగు రోజుల వ్యవధిలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
AP News
Telugu News