SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jubilant Ingrevia: గ్రామాన్ని కబళిస్తున్న కెమికల్‌ ఫ్యాక్టరీ.. 'కాలా పానీ'తో నరకం అనుభవిస్తున్న ప్రజలు

Zee Exclusive Ground Reality On Jubilant Ingrevia Gajraula Chemical Factory Pollution: ఓ రసాయన పరిశ్రమ ఓ గ్రామాన్ని కబళిస్తోంది. కాలుష్యంతో కమ్ముకున్న ఆ గ్రామంలో ప్రజలు జీవించలేకపోతున్నారు. రసాయనాలు వారి జీవితంలో భాగమైనట్టు దారుణంగా మారాయి. ఆ గ్రామంలో కాలా పానీతో మరణాలు సంభవిస్తుండగా.. భారీ ఎత్తున ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కాలా పానీపై జీ న్యూస్‌ ప్రత్యేక కథనం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 12, 2026, 10:36 PM IST | Updated: Nov 12, 2026, 10:39 PM IST
Image Credit: Kala Pani
Join

Jubilant Ingrevia Pollution: రసాయన పరిశ్రమ గ్రామాన్ని కబళిస్తోంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీతో ప్రజలు తీవ్ర తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీ కారణంగా రసాయనాలు వెదజల్లి ఆ గ్రామాన్ని ముంచెత్తుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున మరణిస్తుండగా.. పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ ఫ్యాక్టరీ కారణంగా గాలి, నీరు కలుషితమవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జూబిలెంట్ ఇంగ్రేవియా ఫ్యాక్టరీ సృష్టిస్తున్న కాలుష్య కోరలపై జీ న్యూస్‌ ప్రత్యేక కథనం ఇదే.

ఒక ప్రాంతంలో ఏదైనా ఫ్యాక్టరీ ఏర్పాటయితే.. ఆ ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలో సుఖసంతోషాలు, అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని అందరూ చెబుతారు. చుట్టుపక్కల నివసించే ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధిని తేవాలి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కొనసాగుతున్న ఓ ఫ్యాక్టరీ ఇప్పుడు చుట్టుపక్కల ఉండే ప్రజలకు భయోత్పాతం కలిగిస్తోంది. ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా నీరు, గాలి కలుషితమయ్యాయని.. ఫ్యాక్టరీతో చుట్టుపక్కల ప్రజలు కేవలం తీవ్రమైన వ్యాధుల బారిన పడడమే కాకుండా ఫ్యాక్టరీ కారణంగా అనేక మంది మరణించడంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జీ న్యూస్‌ అందిస్తున్న ఆపరేషన్ 'కాలా పానీ' ప్రత్యేక కథనం తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా గజ్రౌలాలో జూబిలెంట్ ఇంగ్రేవియా ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ స్పెషాలిటీ కెమికల్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. అక్కడ ప్రమాదకర పారిశ్రామిక రసాయనాలు తయారవుతాయి. వీటి నిర్వహణ, వ్యర్థ నిర్వహణ కోసం కఠినమైన భద్రతా ప్రమాణాలు అవసరం. చుట్టుపక్కల గ్రామస్తులు ఫ్యాక్టరీ నుంచి వెలువడే గ్యాస్, దుర్వాసన, చుట్టుపక్కల ప్రాంతాల నీటి నాణ్యత గురించి ఏళ్ల తరబడి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

ఇదంతా జూబిలెంట్ ఫ్యాక్టరీతో జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అది నీటిని కలుషితం చేస్తోంది. ఈ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు చనిపోవడమే కాకుండా.. 7 ఏళ్లలో ఏడుగురు మృతి చెందారు. అందరి మరణానికి కారణం జూబిలెంట్ ఇంగ్రేవియా ఫ్యాక్టరీయే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఇల్లు ఫ్యాక్టరీకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు పగలైనా, రాత్రయినా శ్వాస తీసుకోలేకపోతున్నరు. చివరికి భూగర్భ జలాలు కూడా కలుషతమవుతున్నాయి. జూబిలెంట్ ఫ్యాక్టరీ చుట్టూ 20కి పైగా గ్రామాలు ఉన్నాయి. నైపురా, సవాజ్‌పూర్ డోర్, సాదేలాపూర్, బసేలీ, తిగ్రియా గ్రామాలు అత్యధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రామంలో పరిస్థితి రోజురోజుకు భయంకరంగా మారిపోతోంది. భూగర్భ జలాలు పూర్తిగా పసుపు రంగులో ఉంది. ఈ నీరు తాగి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు.

నీటి కలుషితం ఎందుకు?
ఈ ఫ్యాక్టరీ వలన గ్రామాల్లో భూగర్భ జలాలు ఆందోళనకరంగా మారింది. ఇక్కడ భూగర్భ జలాలు శుభ్రంగా లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. హ్యాండ్‌పంప్ నుంచి కూడా నల్లటి నీరు వస్తోంది. ఈ నీటిని ఎవరైతే తాగుతున్నారో.. వారంతా వ్యాధుల బారిన పడుతున్నారు. ఎన్ని హ్యాండ్‌పంప్‌లు ఉన్నాయో అన్నింటిలో నీరు అలాగే వస్తోంది. నీటి రంగు మారిపోయి ప్రజలు తాగలేకపోతున్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే ప్రజలు తమ అనారోగ్యాలకు కేవలం ఫ్యాక్టరీనే కారణమని ఆరోపిస్తున్నారు.

ఫ్యాక్టరీ ఏర్పాటైనప్పటి నుంచి తమ ప్రాంతం వ్యాధుల అడ్డాగా మారిపోయిందని స్థానిక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల అనారోగ్య పాలవుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ వస్తోంది. రాళ్లు (కిడ్నీలో రాళ్లు) ఏర్పడుతున్నాయి. అక్కడి స్థానికులు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఇందులో ఫ్యాక్టరీ నీరు వస్తుండడంతో ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కంటి చూపు పూర్తిగా కోల్పోతున్నారు. కళ్లలో కూడా సమస్యలు వస్తున్నాయి.

గజ్రౌలాలోని ఈ గ్రామాల నీరు నిజంగానే కలుషితమైందా లేదా అని పరిశీలించడానికి జీ మీడియా క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ గ్రామం నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించింది. ఆ ల్యాబ్‌లో గ్రామం నుంచి సేకరించిన నీటి వివిధ నమూనాలను పరీక్షిస్తారు. ఆ ల్యాబ్ నివేదికలో అసలు ఏ విషయాలు వెల్లడయ్యాయి. గజ్రౌలాలోని జూబిలెంట్ ఇంగ్రేవియా ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న గ్రామం ఎలా క్యాన్సర్ గ్రాయంగా మారిపోయిందో తదుపరి నివేదికలో మీకు చూపిస్తాం.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES