• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /MIM ASP Alliance: యోగి ఆదిత్యనాథ్‌ని 'గద్దె' దించేందుకు ఆజాద్‌ పార్టీతో మజ్లిస్‌ పొత్తు

MIM ASP Alliance: యోగి ఆదిత్యనాథ్‌ని 'గద్దె' దించేందుకు ఆజాద్‌ పార్టీతో మజ్లిస్‌ పొత్తు

AIMIM Joins Hand With ASP In Uttar Pradesh Assembly Elections: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మజ్లిస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆజాద్‌ సమాజ్‌ పార్టీతో మజ్లిస్‌ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు అసదుద్దీన్‌ ఓవైసీ కీలక ప్రకటన చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 13, 2026, 12:22 AM IST|Updated: Nov 13, 2026, 12:27 AM IST
joinshare
MIM ASP Alliance: యోగి ఆదిత్యనాథ్‌ని 'గద్దె' దించేందుకు ఆజాద్‌ పార్టీతో మజ్లిస్‌ పొత్తు
Image Credit: AIMIM Joins Hand With ASP

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
VC Sajjanar: గుండెనిండా మధుర జ్ఞాపకాలతో ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ సందేశం

VC Sajjanar: గుండెనిండా మధుర జ్ఞాపకాలతో ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ సందేశం

2

MIM ASP Alliance: యోగి ఆదిత్యనాథ్‌ని 'గద్దె' దించేందుకు ఆజాద్‌ పార్టీతో మజ్లిస్‌ పొత్తు

3

Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా

4

Jubilant Ingrevia: గ్రామాన్ని కబళిస్తున్న కెమికల్‌ ఫ్యాక్టరీ.. 'కాలా పానీ'తో నరకం అనుభవిస్తున్న ప్రజలు

5

Monal Gajjar Cancer: బిగ్‌బాస్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్‌కు క్యాన్సర్..సర్జరీ తర్వాత షాకింగ్ వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Uttar Pradesh Assembly Elections: ఉత్తరప్రదేశ్‌లో రెండు సార్లు భారీ విజయం సాధించిన బీజేపీ మూడోసారి కూడా అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ రాష్ట్ర రాజకీయాలను మార్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మరో పార్టీతో జత కట్టింది. ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా యూపీ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మజ్లిస్‌ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ గురువారం పొత్తును ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏఎస్‌పీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. పొత్తులో భాగంగా నవంబర్ 26వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ, మేధోపరమైన నిజాయితీతో కూడిన బలమైన కూటమిగా అభివర్ణించారు.

'రాష్ట్రంలో ముస్లిం, దళిత ఓట్లను ఏకం చేసే దిశగా ఈ రెండు పార్టీల కలయిక యూపీ రాజకీయాల్లో ఒక పెద్ద పరిణామం' అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు సుమారు 20 శాతం ఉండగా, దళితులు సుమారు 21 శాతం ఉన్నారు. ఈ కూటమి ద్వారా ముస్లిం, దళిత ఓట్లలో కొంత భాగాన్ని రాబట్టాలని.. తద్వారా ప్రతిపక్షాల ఎన్నికల సమీకరణాలను దెబ్బతీయాలని ఈ కొత్త కూటమి భావిస్తోంది. బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి.. ఈ ప్రయత్నంలో భాగంగానే భీమ్ ఆర్మీ చీఫ్‌తో పొత్తు పెట్టుకున్నట్లు వివరణ ఇచ్చారు.

'వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాలు అణగారిన వర్గాల ప్రజల పరిస్థితిని మెరుగుపరచడంలో విఫలమయ్యాయి. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం పేరుతో ఇచ్చిన హామీలు ఆచరణలో ఎలాంటి సార్థకతను చూపలేదు' అని ఏఎస్‌పీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. పేదరికాన్ని, అసహాయతను తొలగిస్తామని,అణచివేత, కుల వివక్ష, దాడులకు అంతం పలకతామని ప్రకటించారు. నేటికీ బహుజన సమాజం అభివృద్ధికి, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయాయని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

'మజ్లిస్‌తో పొత్తు ఒక 'థర్డ్ ఫ్రంట్' కాదు. ఇది సామాజిక మార్పును తెచ్చేందుకు, సమాజంలోని అణగారిన, హక్కులు కోల్పోయిన, దోపిడీకి గురవుతున్న వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ వేదిక' అని ఆజాద్ సమాజ్ పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సామాజిక మార్పు కోసం ఏర్పడిన ఒక శక్తివంతమైన వేదిక అని.. ఇది ఇప్పటికే బలంగా ఉంది, మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ కూటమిలోకి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లకు కూడా ఆహ్వానం పలికారు.

'సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌ పార్టీల నుంచి సానుకూల స్పందన లభించనప్పటికీ.. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చల్లో నిమగ్నమై ఉన్నాం. ఆ రెండు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నంలో తమ కూటమిలో చేరాలి' అని మజ్లిస్‌ అధినేత ఒవైసీ, ఆజాద్ కోరారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటంలో భాగస్వాములు కావాలనుకునేవారికి స్వాగతం అని ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Politics
Telugu News
National News