• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేచురల్ హార్ట్ ప్రొటెక్టర్స్.. గుండెకు కొండంత బలానిచ్చే 5 ఎర్రటి పండ్లు ఇవే!

నేచురల్ హార్ట్ ప్రొటెక్టర్స్.. గుండెకు కొండంత బలానిచ్చే 5 ఎర్రటి పండ్లు ఇవే!

Written ByRenuka Godugu
Published: Sep 27, 2026, 04:13 PM IST|Updated: Sep 27, 2026, 04:16 PM IST
joinshare

గుండె ఆరోగ్యం కోసం మనం పాటించే డైట్, రోజూ నడక వంటి అలవాట్లు మాత్రమే కాకుండా, మనం తినే కొన్ని కూరగాయలు కూడా ఎంతో ముఖ్యమైనవి. సప్లిమెంట్స్ అవసరం లేకుండా సహజంగా లభించే ఈ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ ఐదు ఎరుపు రంగు పండ్లను చేర్చుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 

Cherries1/5

చెర్రీ

చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా, చెర్రీ పండ్లు బీపీని, కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాన్ని కలిగి ఉండి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
Strawberries2/5

స్ట్రాబెరీ

స్ట్రాబెరీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె రక్తనాళాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. కనీసం వారానికి ఒక్కసారైనా వీటిని తీసుకోవాలి.
Rasberries3/5

రాస్ బెర్రీలు

రాస్ బెర్రీలు కూడా బెర్రీ జాతికి చెందినవే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు , ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి శరీరంలోని మంట సమస్యను తగ్గించి, ఆక్సిడేటివ్ నష్టం నుండి రక్షిస్తాయి.
Tomatoes4/5

టమాటాలు

టమాటాలు మన ఇంట్లో నిత్యం అందుబాటులో ఉంటాయి. వీటిలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నివేదికల ప్రకారం, లైకోపీన్ గుండె సమస్యలను తగ్గించడమే కాకుండా, రక్తనాళాలకు రక్షణ కవచంలా పనిచేసి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
Pomegranate5/5

దానిమ్మ పండు

దానిమ్మ పండు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇందులో బీపీని తగ్గించే గుణం కూడా ఉంది. దానిమ్మ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
TAGS:
Health

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.