• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. లెవల్ 6, 7, 8 ఉద్యోగుల జీతాలు ఎంతంటే?

8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. లెవల్ 6, 7, 8 ఉద్యోగుల జీతాలు ఎంతంటే?

Written ByVishnu Priya
Published: Oct 06, 2026, 04:01 PM IST|Updated: Oct 06, 2026, 04:08 PM IST
joinshare

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం కీలకంగా మారనుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి అంశాలపై 8వ వేతన సంఘం ఇప్పటికే సంప్రదింపులు కొనసాగిస్తోంది. అక్టోబర్ 7, 8 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో మరో దఫా సమావేశాలు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 22, 23 తేదీల్లో ముంబైలో సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
 

8th Pay Commission Latest Update1/5

పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

8వ వేతన సంఘం ఇంకా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అందువల్ల ప్రస్తుతం ఉద్యోగుల కొత్త జీతాలపై వస్తున్న లెక్కలు కేవలం అంచనాలు మాత్రమే. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాతే కొత్త జీతాలు ఎంత ఉంటాయో స్పష్టత వస్తుంది.
 Fitment Factor 20262/5

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?

ఉద్యోగి ప్రస్తుతం తీసుకుంటున్న బేసిక్ పేను ఒక నిర్దిష్ట సంఖ్యతో గుణించి కొత్త బేసిక్ పేను లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యనే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. గతంలో 6వ వేతన సంఘంలో ఇది 1.86గా ఉండగా, 7వ వేతన సంఘంలో 2.57గా ఉంది. 8వ వేతన సంఘం విషయంలో కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగ సంఘాలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి.
Central Government Salary Hike3/5

లెవల్ 6 ఉద్యోగుల జీతం

ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం లెవల్ 6 బేసిక్ పే రూ.35,400గా ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.0గా ఉంటే కొత్త బేసిక్ పే సుమారు రూ.70,800 అవుతుంది. అదే 2.15గా ఉంటే రూ.76,110, 2.28గా ఉంటే రూ.80,712 అవుతుంది. 2.57గా ఉంటే రూ.90,978కు చేరుతుంది.
 8th Pay Commission Basic Pay4/5

లెవల్ 7, 8 ఉద్యోగులకు ఎంత?

లెవల్ 7లో ప్రస్తుతం బేసిక్ పే రూ.44,900. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంటే ఇది సుమారు రూ.1,15,393కు చేరే అవకాశం ఉంటుంది. లెవల్ 8 ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ పే రూ.47,600. ఇదే 2.57 ఫ్యాక్టర్‌తో లెక్కిస్తే కొత్త బేసిక్ పే సుమారు రూ.1,22,332 అవుతుంది. అయితే ఇవన్నీ కేవలం ఉదాహరణ లెక్కలు మాత్రమే. నిజమైన జీతం నిర్ణయించేటప్పుడు అలవెన్సులు, డిడక్షన్లు, కొత్త పే మ్యాట్రిక్స్ వంటి అంశాలు కూడా పరిగణనలోకి వస్తాయి.
Pay Commission Salary Calculation5/5

ఉద్యోగ సంఘాల డిమాండ్ ఎంత?

కొన్ని ఉద్యోగ సంఘాలు మరింత ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కోరుతున్నాయి. NC-JCM 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం. మరో ఉద్యోగుల సమాఖ్య BPMS 4 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కోరుతోంది. అయితే ఇవి ఉద్యోగ సంఘాల డిమాండ్లు మాత్రమే. ప్రభుత్వం ఇంకా ఆ ప్రతిపాదనలను ఆమోదించలేదు. 8వ వేతన సంఘం తుది నివేదికను 2027 మే-జూన్ సమయంలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాతే ఉద్యోగుల కొత్త జీతాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
TAGS:
Pay Commission
National News

Trending

  • News
  • Photos
  • Videos
KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్

KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్

2

Indiramma Towers: హైదరాబాద్‌ ప్రజలకు తెలంగాణ మంత్రి శుభవార్త.. ఇందిరమ్మ టవర్స్‌పై కీలక అప్‌డేట్‌

3

అరటిపండు ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో తింటే శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది?

4

భారత్ vs వెస్టిండీస్ తొలి టీ20: శ్రేయస్ సేనకు అసలైన పరీక్ష.. ఓపెనింగ్‌‌పై కొనసాగుతున్న ఉత్కంఠ..!

5

Tirumala: భక్తులకు బంపర్ శుభవార్త.. రేపు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. పూర్తి వివరాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.