ఎయిర్‌టెల్ యూజర్‌లకు పండగలాంటి వార్త.. ఇప్పటికే వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ప్రవేశపెట్టిన మొదటి టెలికాం కంపెనీగా గుర్తింపు పొందింది. దీంతోపాటు యూజర్‌లకు బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్యాక్‌లు, దానికి తగిన యాడ్ ఆన్ ప్యాకేజీలను కూడా అందిస్తుంది. అయితే, ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.200 ఓటీటీ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
1/5
ఎయిర్‌టెల్ సిమ్
మీరు ఎయిర్‌టెల్ సిమ్ వినియోగదారులా? అయితే మీకు బంపర్ గుడ్‌న్యూస్ రూ.200తో రీఛార్జీ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాన్‌లో మీరు 18 పైగా ఓటీటీ, 30 జీబీ డేటాతోపాటు కొత్తగా యూట్యూబ్ ప్రీమియం కూడా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇందులో అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలివ్ కూడా ఉంటాయి. ఈ ప్యాక్‌తో రీఛార్జీ చేసుకుంటే 28 రోజులపాటు వర్తిస్తుంది. అయితే, మీకు ముందుగానే ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి.
2/5
ఎయిర్‌టెల్
అయితే, ఎయిర్‌టెల్ ఈ బెనిఫిట్స్‌తోపాటు రూ.200 ఓటీటీ టాప్‌అప్ ప్లాన్‌తో యూట్యూబ్ ప్రీమియం ఉచితంగా పొందుతారు. అదనంగా 30 జీబీ డేటా లభిస్తుంది. దీంతో ఎంటర్‌టైన్మెంట్ సర్వీస్ యాక్సెస్‌తోపాటు క్రియేటర్స, మ్యూజిక్ కూడా వినవచ్చు. అయితే, ఈ యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్ పై మాత్రం ఒక షరతు ఉంది.
3/5
ఎయిర్‌టెల్ 200 రూపాయల రీఛార్జ్ ప్లాన్
దీని వ్యాలిడిటీ కేవలం 28 రోజులపాటు మాత్రమే ఉంటుంది. బేసిక్ ప్లాన్‌తో సంబంధం లేదు... టాప్ అప్ వ్యాలిడిటీ పూర్తయితే, మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటీటీ పోర్ట్‌ఫోలియోలో ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనీలివ్‌తోపాటు యూట్యూబ్ ప్రీమియం కూడా పొందుతారు.
4/5
ఎయిర్‌టెల్ యూట్యూబ్ ప్రీమియం
యూట్యూబ్ ప్రీమియం క్లెయిమ్ చేసే విధానం..
రూ.200 ఎయిర్‌టెల్ టాప్ అప్‌తో రీఛార్జీ చేసుకుంటే బోలెడు బెనిఫిట్స్ పొందుతారు. దీనికి మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్ యాక్టీవ్‌గా ఉండాలి. రూ.200 ఓటీటీ టాప్ అప్ చేయించాలి. ఇందులో యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్స్, 30 జీబీ అదనపు డేటా కూడా లభిస్తుంది. యూట్యూబ్ కోసం ఎయిర్‌టెల్ యాప్‌లో రివార్డ్స్, ఓటీటీ సెక్షన్ ఎంచుకోండి. అక్కడ స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న నిబంధనలు ఫాలో అవ్వాలి. క్లెయిమ్ అయిన వెంటనే యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్ 28 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది.
5/5
ఎయిర్ టెల్ రీఛార్జీ ప్లాన్ వివరాలు
ఈ యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ఎయిర్‌టెల్ యూజర్‌లు డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ యాక్సెస్ చేయవచ్చు. ప్రధానంగా క్రియేటర్స్ వీడియోలు ఎక్కువగా చూసేవారు. మ్యూజిక్ వినేవారికి ఇది బెస్ట్ ప్లాన్.