• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Andhra Pradesh Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి

Andhra Pradesh Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి

Written ByVishnu Priya
Published: Sep 22, 2026, 01:15 PM IST|Updated: Sep 22, 2026, 09:23 PM IST
joinshare

Andhra Pradesh Weather Alert:  ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాల ముప్పు ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
 

 


 

IMD weather alert1/5

వాతావరణ శాఖ హెచ్చరిక

భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని కొందరు తల్లిదండ్రులు, వాతావరణ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సెలవులపై తుది నిర్ణయం సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది.
AP schools holiday2/5

ఏపీ స్కూళ్లకు సెలవులు

శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మాత్రం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఇతర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 AP rain forecast3/5

ఏపీ వర్షాల అంచనా

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వ్యవస్థ బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు.
 Bay of Bengal depression4/5

బంగాళాఖాతం వాయుగుండం

తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
Andhra Pradesh cyclone alert5/5

ఏపీ వాతావరణం తాజా సమాచారం

రాబోయే నాలుగు రోజులు వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచిస్తున్నారు.
TAGS:
Andhra Pradesh

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.