Anupama Parameswaran: నటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ ఈవెంట్లో తాను అబ్బాయిగా పుట్టుంటే బాగుండేదని అనిపించిందని అనుపమ చెప్పింది.
1/5
అనుపమ తాజా వార్తలు
క్రేజీ కళ్యాణం ఈవెంట్లో అనుపమ చేసిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆగట్టుకుంటున్నాయి. తరుణ్ భాస్కర్‌తో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అనుపమ తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలోనే కాకుండా ప్రమోషన్స్‌లో కూడా ఇద్దరూ చాలా సరదాగా గడిపామని చెప్పింది. తరుణ్ పాత్ర గురించి విన్న తర్వాత అలాంటి పాత్ర తనకు కూడా కావాలని దర్శకుడు బద్రిని అడిగినట్లు వెల్లడించింది.
2/5
తరుణ్ భాస్కర్ పాత్ర
“తరుణ్ పాత్ర గురించి విన్న తర్వాత నేను అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది అనుకున్నాను. అలాంటి పాత్రను నాకు కూడా రాయమని బద్రిని అడిగాను. తరుణ్‌తో కలిసి పనిచేయడం, సినిమా ప్రమోషన్స్ చేయడం చాలా సరదాగా అనిపించింది” అని అనుపమ చెప్పింది.
3/5
క్రేజీ కళ్యాణం ఈవెంట్
తరుణ్, తన ఆలోచనలు చాలా వరకు ఒకేలా ఉంటాయని ఆమె తెలిపింది. అతను ఎప్పుడూ తనలాగే సహజంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. సాధారణంగా అనుపమ సినిమా కథ, అందులోని పాత్ర నచ్చితేనే సినిమాను అంగీకరిస్తుంది. కానీ ‘క్రేజీ కళ్యాణం’ విషయంలో మాత్రం దర్శకుడు బద్రిపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. బద్రి సినిమా తీసే విధానం, ఆయన నిజాయితీ తనకు నచ్చాయని తెలిపింది. షూటింగ్ సమయంలో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ, ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పింది.
4/5
అనుపమ స్పీచ్
నిర్మాత జగన్‌కు ఈ సినిమా ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అనుపమ తెలిపింది. అందుకే తాను కూడా ఈ సినిమాను చిన్న చిత్రంగా చూడలేదని చెప్పింది. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రఫీ, నిర్మాణం, దర్శకత్వ బృందం చేసిన కృషిని ప్రశంసించింది. సహనటులు అఖిల్, నరేష్ గురించి కూడా అనుపమ మంచి మాటలు చెప్పింది. ముఖ్యంగా నరేష్ నటన పట్ల చూపించే అంకితభావం తనకు స్ఫూర్తినిస్తుందని తెలిపింది.
5/5
క్రేజీ కళ్యాణం విడుదల తేదీ
అక్టోబర్ 16న విడుదల కానున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని అనుపమ కోరింది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ తమ కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.