• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Bank Holiday: 5 రోజుల పాటు బ్యాంకులు బంద్.. కేంద్రం కీలక సూచనలు..!

Bank Holiday: 5 రోజుల పాటు బ్యాంకులు బంద్.. కేంద్రం కీలక సూచనలు..!

Written ByVishnu Priya
Published: Sep 21, 2026, 10:19 PM IST|Updated: Sep 22, 2026, 09:24 PM IST
joinshare

Bank Holiday: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. ఈ నెల చివర్లో బ్యాంకింగ్ సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడే పరిస్థితి ఉంది. దీంతో ఖాతాదారులు ముందుగానే తమ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవడం మంచిది.
 

Bank Holiday 20261/5

బ్యాంక్ హాలిడేస్ 2026

ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. దీనికి ముందు 26వ తేదీ శనివారం, 27వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా బ్యాంకులకు సెలవులు వస్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలు మూసివేయబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక సూచనలు చేసింది. బ్యాంకులు మూసి ఉన్న సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు ఎక్కువగా రాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది.
 Digital Banking2/5

ATM నగదు

ముఖ్యంగా ATMల్లో తగినంత నగదు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకు శాఖలు పనిచేయకపోయినా ప్రజలు ATMల ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ATMల్లో నగదు కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే అత్యవసర బ్యాంకింగ్ సేవలు కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం పేర్కొంది. ఖాతాదారులకు కలిగే ఇబ్బందులను వీలైనంత వరకు తగ్గించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని సూచించింది.
 Bank Strike3/5

డిజిటల్ బ్యాంకింగ్

ఈ అంశంపై ఆర్థిక సేవల విభాగం (DFS) బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనుంది. బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు, ATMలలో నగదు లభ్యత, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Bank Holiday4/5

UPI సేవలు

అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI వంటి సేవలను ఉపయోగించే ఖాతాదారులు తమ అవసరాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. అయితే సాంకేతిక సమస్యలు లేదా సేవలపై పరిమితులు ఉంటే పరిస్థితి మారవచ్చు.
Banking Services5/5

బ్యాంకింగ్ సేవలు

అందువల్ల నగదు అవసరం ఉన్నవారు ముందుగానే ATM నుంచి డబ్బు తీసుకోవడం, బ్యాంకులో చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
TAGS:
National News

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.