Bank Holiday November 27: సాధారణంగా ఏ బ్యాంకు అయినా ప్రతి ఆదివారం పనిచేయదు. దీంతోపాటు రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. నవంబర్ 27 శుక్రవారం కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
1/5
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈరోజు హాలిడే ప్రకటించారు. ఈరోజు కనక దాస్ జయంతి సందర్భంగా కర్నాటకలోని బ్యాంకులన్నీ బంద్ ఉంటాయి. ఇది ప్రభుత్వ, ప్రైవేటు రంగు బ్యాంకులకు కూడా వర్తిస్తుంది.
2/5
నవంబర్ 27 బ్యాంకులకు సెలవు
నవంబర్ 27 శుక్రవారం కవి తత్వవేత్త , సామాజిక సంస్కర్త అయిన శ్రీ కనకదాస జయంతి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నాటకలోని అన్నీ బ్యాంకులు పనిచేయవు.
3/5
బ్యాంకులకు సెలవు
ఇక నవంబర్ 27 అక్కడ బ్యాంకులు బంద్ ఉంటాయి. నవంబర్ 28 నాలుగో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు బంద్ ఉంటాయి. దీంతోపాటు 30వ తేదీ ఆదివారం కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
4/5
శుక్రవారం బ్యాంకులు బంద్
దీంతో వరుసగా అక్కడ మూడు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే, ఇతర రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ బ్యాంక్ బంద్ సమయంలో ఏటీఎం సేవలు 24 గంటలపాటు పనిచేస్తాయి.
5/5
డిజిటల్ చెల్లింపులు
యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. చెక్ క్లియరెన్స్ పనులకు మాత్రం బ్యాంకు బ్రాంచీలకు వెళ్లాల్సిందే. పెద్ద ఎత్తున డబ్బు డిపాజిట్ చేయాలంటే కూడా బ్యాంకులు ఓపెన్ ఉండాలి.