• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Bank Holidays October 2026: అక్టోబర్‌లో వరుస సెలవులు.. 11 రోజులు మూతపడనున్న బ్యాంకులు

Bank Holidays October 2026: అక్టోబర్‌లో వరుస సెలవులు.. 11 రోజులు మూతపడనున్న బ్యాంకులు

Written ByVishnu Priya
Published: Sep 25, 2026, 12:18 PM IST|Updated: Sep 25, 2026, 12:40 PM IST
joinshare

Bank Holidays October 2026: అక్టోబర్ 2026లో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులకు పలు రోజులు సెలవులు ఉన్నాయి. RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం వివిధ రాష్ట్రాలు, నగరాల్లో కలిపి 11 రోజుల వరకు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే అన్ని సెలవులు దేశవ్యాప్తంగా వర్తించవు.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు బ్రాంచ్‌లో పనులు ఉన్నవారు సెలవుల తేదీలను ముందుగానే చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

 bank holidays in Andhra Pradesh1/5

దసరా బ్యాంక్ సెలవు 2026

అక్టోబర్ నెలలో బ్యాంక్ పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిపి బ్యాంకులకు దాదాపు 11 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.
 bank holidays in Telangana2/5

గాంధీ జయంతి బ్యాంక్ సెలవు

అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. కొన్ని జాతీయ సెలవులు దేశవ్యాప్తంగా వర్తిస్తే, మరికొన్ని స్థానిక పండుగల కారణంగా కొన్ని రాష్ట్రాలు లేదా నగరాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి.
Dussehra bank holiday 20263/5

దేశవ్యాప్తంగా ఉండే సెలవులు

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 24 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలు ఆదివారాలు కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
 Gandhi Jayanti bank holiday4/5

దసరా, దుర్గాపూజ సెలవులు

అక్టోబర్‌లో దసరా, దుర్గాపూజ కారణంగా కూడా పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ 17న అగర్తలాలో మహా సప్తమి సందర్భంగా సెలవు ఉంది. అక్టోబర్ 19న దుర్గాష్టమి, మహానవమి సందర్భంగా పలు నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్టోబర్ 20న దసరా సెలవు ఉండనుంది. అక్టోబర్ 21న కూడా కొన్ని ప్రాంతాల్లో దుర్గాపూజ, విజయదశమి కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
 RBI holiday calendar 20265/5

ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ 2026

అక్టోబర్ 26న కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీపూజ, వాల్మీకి జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 29న కర్వా చౌత్ కారణంగా సిమ్లాలో, అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. బ్యాంక్ బ్రాంచీలు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కు క్లియరెన్స్, నగదు డిపాజిట్, లోన్ సంబంధిత పనులు వంటి బ్రాంచ్‌లో చేయాల్సిన పనులు ఉంటే సెలవుల తేదీలను ముందుగానే చూసుకుని వెళ్లడం మంచిది.
TAGS:
Bank Holiday

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.