బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ 25నే ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.
Government Salary Update: ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె జరగనున్న నేపథ్యంలో జీతాలు, పెన్షన్ చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా కేంద్రం ముందస్తు చెల్లింపులకు అనుమతించింది. డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం వర్తించనుంది. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకుల సమ్మె జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేసింది. బ్యాంకుల సమ్మె కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు, పెన్షన్ డబ్బుల కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.
1/5
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరులో జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఈసారి బ్యాంకుల సమ్మె కారణంగా చెల్లింపుల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ డబ్బులను ముందుగానే చెల్లించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
2/5
బ్యాంక్ స్ట్రైక్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ డబ్బులను సెప్టెంబర్ 25వ తేదీనే వారి ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతించినట్లు సమాచారం. దీంతో బ్యాంకుల సమ్మె ప్రారంభమయ్యే ముందే ఉద్యోగులు, పెన్షనర్లకు డబ్బులు అందనున్నాయి.
3/5
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు
ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కొన్ని ముఖ్యమైన విభాగాలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో పనిచేసే వారికి కూడా ఈ ముందస్తు చెల్లింపులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
4/5
అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణింపు
సెప్టెంబర్ 25న జమ చేసే ఈ మొత్తాన్ని ప్రభుత్వం ‘అడ్వాన్స్ పేమెంట్’గా పరిగణిస్తుంది. అంటే ఉద్యోగులకు అదనంగా డబ్బులు చెల్లించడం కాదని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలకు రావాల్సిన జీతం లేదా పెన్షన్ మొత్తాన్నే ముందుగా చెల్లిస్తారు.
5/5
పెన్షన్ డబ్బులు
లెక్కలు పూర్తిగా ఖరారైన తర్వాత అవసరమైన సర్దుబాట్లు చేస్తారు. అక్టోబర్ నెల చెల్లింపుల్లో మిగిలిన మొత్తాలను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకుల సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్ చెల్లింపులు ఆలస్యం కాకుండా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుంది. ముఖ్యంగా నెలాఖరులో అవసరమైన ఖర్చులు ఉండే వారికి ముందుగానే డబ్బులు ఖాతాల్లోకి రావడం ఉపయోగకరంగా మారనుంది.