Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో డ్రామా పెంచేందుకు ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అపూర్వ, మిథిలేష్, దీపక్, రామకృష్ణ పేర్లు వినిపిస్తుండగా, వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఆసక్తి నెలకొంది.
1/5
అపూర్వ బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో ఆసక్తికరమైన మార్పులు జరగబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఇప్పటికే ఎలిమినేషన్స్ కారణంగా కొంతమంది హౌస్ నుంచి బయటకు వెళ్లారు. చైత్ర రాయ్, చరణ్ మొదట్లో ఎలిమినేట్ కాగా, చరణ్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
2/5
మిథిలేష్ బిగ్ బాస్
అయితే హౌస్‌లో ఊహించిన స్థాయిలో డ్రామా కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈసారి ఇద్దరు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైల్డ్ కార్డ్ అవకాశాల కోసం అపూర్వ, మిథిలేష్, దీపక్, రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. షో ప్రారంభానికి ముందే అపూర్వ, రామకృష్ణ పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వారు మొదటి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు వారిలో కొందరికి వైల్డ్ కార్డ్ ద్వారా అవకాశం దక్కవచ్చనే వార్తలు వస్తున్నాయి.
3/5
దీపక్ బిగ్ బాస్
గత సీజన్‌లో కూడా మూడో వారంలో ‘అగ్ని పరీక్ష’కు సంబంధించిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. అదే తరహాలో ఈసారి కూడా కొత్త ఎంట్రీలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈసారి నలుగురు పేర్లను పరిశీలించి, అందులో ఇద్దరిని ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.
4/5
రామకృష్ణ బిగ్ బాస్
కొత్తగా వచ్చే కంటెస్టెంట్లకు చిన్న టాస్కులు ఇవ్వడం లేదా ఓటింగ్ నిర్వహించడం వంటి విధానాలను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో కొనసాగుతున్న ‘టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్’ థీమ్‌కు అనుగుణంగా ఈ ఎంట్రీలను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
5/5
బిగ్ బాస్ తెలుగు తాజా అప్‌డేట్
అపూర్వ హౌస్‌లోకి వస్తే రోహిత్‌తో ఆమెకు ఉన్న పాత పరిచయాలు, విభేదాలు మళ్లీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రామకృష్ణ ఎంట్రీతో ఝాన్సీకి సంబంధించిన అంశాలు కూడా ఆసక్తిని పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజంగా ఎవరు హౌస్‌లోకి వస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.