• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /BSNL సంచలనం.. రూ.2,399 ప్లాన్‌పై ఊహించని ఆఫర్! ఏకంగా 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా!

BSNL సంచలనం.. రూ.2,399 ప్లాన్‌పై ఊహించని ఆఫర్! ఏకంగా 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా!

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 07:40 AM IST|Updated: Oct 04, 2026, 07:49 AM IST
joinshare

భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ ఒక బంపర్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీలో వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు కచ్చితంగా 'పైసా వసూల్' అనిపించే ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 380 రోజుల వాలిడిటీతో పాటు 760 GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 

BSNL Unlimited Calling Offer1/6

BSNL అపరిమిత కాలింగ్ ఆఫర్

BSNL ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను అందిస్తోంది. అయితే, ఇప్పుడు 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌కు అదనంగా 15 రోజులను జోడించి, మొత్తం 380 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు 760 GB డేటాను కూడా పొందవచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ప్రశాంతంగా వాడుకోగలిగే ప్లాన్ ఇది. ఈ BSNL ప్లాన్ గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
Bharat Sanchar Nigam Limited2/6

భారత్ సంచార నిగమ్ లిమిటెడ్

BSNL వారి రూ.2399 ప్లాన్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్. సాధారణంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది, కానీ ప్రస్తుతం కంపెనీ అదనంగా 15 రోజులను కలిపి మొత్తం 380 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
BSNL3/6

బీఎస్‌ఎన్‌ఎల్‌

ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. 380 రోజుల వ్యాలిడిటీ కాలంలో మొత్తం 760 GB డేటా అందుబాటులో ఉంటుంది. గతంలో 365 రోజులకు కేవలం 730 GB డేటా మాత్రమే లభించేది.
BSNL 760GB Data Offer4/6

BSNL 760GB డేటా ప్లాన్

X వేదికగా BSNL అధికారికంగా ఈ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.2399 తో రీఛార్జ్ చేస్తే 365 రోజులకు అదనంగా 15 రోజులు కలిపి మొత్తం 380 రోజుల కనెక్టివిటీ లభిస్తుందని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
BSNL 380 Days Validity5/6

రీఛార్జ్ ప్లాన్స్, 380 రోజుల వ్యాలిడిటీ

ఈ BSNL ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఏ నెట్‌వర్క్‌ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా పొందవచ్చు, అంటే 380 రోజుల కాలంలో మొత్తం 38 వేల SMSలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
BSNL 2399 Plan6/6

BSNL 2399 ఆఫర్

X ద్వారా ప్రకటించిన BSNL, ఈ ప్లాన్ కేవలం పరిమిత కాల ఆఫర్ మాత్రమేనని కస్టమర్లకు తెలిపింది. అక్టోబర్ 15 లోపు రీఛార్జ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత, పాత పద్ధతిలోనే సాధారణంగా 365 రోజుల వాలిడిటీ మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
TAGS:
National News

Trending

  • News
  • Photos
  • Videos
సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

2

ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

3

Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

4

సింగీతం మృతిపై రేవంత్,బాలయ్య, పవన్, ఎన్టీఆర్ సహా పలువురి ప్రముఖుల సంతాపం..

5

Haryana: కూతురి కాళ్లపై పడి వేడుకుంటున్న తండ్రి.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. అసలు విషయం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.