ప్రభుత్వ రంగ దిగ్గజ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ రూ.202 సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇందులో డేటాతో పాటు వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా నెల రోజుల పాటు లభిస్తాయి. ఈ రూ.202 ప్లాన్ బడ్జెట్ ధరలో ఉండటం వల్ల బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం రూ.202 కే నెల రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది, కాబట్టి ఈ ప్లాన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1/7
రీఛార్జ్ ప్లాన్
ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగం లిమిటెడ్ వినియోగదారులకు తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇప్పటికే ఈ టెలికాం కంపెనీ ప్లాన్ ధరలు తక్కువగానే ఉంటాయి. అయితే ఇందులో చెప్పుకోదగ్గ ఉత్తమ ప్లాన్ ఈ రూ.202 రీఛార్జ్ ప్లాన్.
2/7
కాలింగ్ బెనిఫిట్స్
ఇందులో మీరు డేటాతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఒక నెల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ దేశంలోని అన్ని టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంది. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నట్లయితే, ఈ ప్లాన్ వివరాలను తెలుసుకోండి.
3/7
బీఎస్ఎన్ఎల్ రూ.202 ప్రీపెయిడ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ.202 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే, ఇందులో మీకు నెలరోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. దీనితో పాటు 300 నిమిషాల వాయిస్ కాలింగ్, 5 GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు. అయితే, ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం డేటా అయిపోయిన తర్వాత 40 Kbps వేగంతో బీఎస్ఎన్ఎల్ నెట్ లభిస్తుంది.
4/7
బీఎస్ఎన్ఎల్ 32 రోజుల వ్యాలిడిటీ ప్లాన్
ఇక ఈ ప్లాన్‌లో 100 SMSలు ఉచితంగా అందించడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. డేటాను పరిమితంగా వాడే ప్రిపెయిడ్ వినియోగదారులకు కాలింగ్, డేటా, SMSలతో కూడిన ఇది ఒక బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు.
5/7
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్
ఈ వాయిస్ వోచర్ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు BSNLసెల్ఫ్ కేర్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా ఇతర రీఛార్జ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. వాటిలో రూ. 247 వాయిస్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఒకటి.
6/7
బీఎస్ఎన్ఎల్ రూ 202 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ.247 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే ఇందులో 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో 50 GB హై-స్పీడ్ 4G డేటా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత 40 Kbps తో బీఎస్ఎన్ఎల్ డేటా అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రతిరోజూ 100 SMSలు పొందుతారు.
7/7
బీఎస్ఎన్ఎల్
యూజర్స్ మెయిన్ ఖాతాకు రూ.10 విలువ కలిగిన ట్యాగ్ వాల్యూ కూడా లభిస్తుంది. ఈ స్పెషల్ టారిఫ్ వోచర్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇది కొత్త ప్లాన్ ఏమీ కాదు, బీఎస్ఎన్ఎల్ దీన్ని చాలా కాలంగా అందిస్తోంది. టెలికాం టాక్.