Lakshmi Narayana Rajayoga 2026: ఈ ఏడాది మంగళవారం నవమిథితికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అక్టోబర్ 20న శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. సొంత రాశి గా భావించే శుక్రుడు.. బుధ గ్రహంతో కలయిక జరిపాడు. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడిందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. ఈ కలయిక కారణంగా సంపదతో పాటు వ్యాపారం, ముఖ్యంగా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని... ఆర్థిక విషయాల్లో కూడా సానుకూలమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరకబోతోందని.. ఆర్థికంగా వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఏరాశుల వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం..
లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ రాశుల వారికి దిమ్మతిరిగే లాభాలు..
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం మంగళవారం ఏర్పడడంతో దీని ప్రభావం మరో కొన్ని రోజులపాటు కొనసాగబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరగడమే కాకుండా తీసుకునే నిర్ణయాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలన్నీ చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభించి జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరగతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పొందగలుగుతారు..
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి చాలాకాలంగా పూర్తికాని పనులు ఈ సమయంలో.. సులభంగా పూర్తి కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా విదేశీ ప్రయాణాలు చేసే వారికి బంపర్ లాభాలు చేకూరుతాయి. విద్యాపరంగా వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని.. అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు..
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అదృష్టం సహకరించడంతో విశేషమైన ధన లాభాలు కలుగుతాయి. సామాజిక హోదా పెరగడమే కాకుండా ఆకర్షణ గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీరు ఈ సమయంలో తప్పకుండా కొత్త వాహనాలతో పాటు కొన్నిరకాల ఆస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారాలు చేసే వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ లాభాలు కూడా సొంతం చేసుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా దిమ్మతిరిగే ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గత సంవత్సరం నిలిచిపోయిన పనులు కూడా పూర్తిగా తిరిగి ప్రారంభమవుతాయి. దీంతోపాటు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగే వ్యక్తులకు బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి.