• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /మీ పిల్లలకు 5 లేదా 15 ఏళ్లు నిండాయా? అయితే 2027 వరకు ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!

మీ పిల్లలకు 5 లేదా 15 ఏళ్లు నిండాయా? అయితే 2027 వరకు ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!

Written ByRenuka Godugu
Published: Nov 21, 2026, 11:40 IST|Updated: Nov 21, 2026, 11:45 IST
joinshare

పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్‌ ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మీ పిల్లలకు ఆధార్‌ కార్డు ఎంత తప్పనిసరి ఉంటుందో దాన్ని ఐదేళ్లు, 15 ఏళ్లు రెండుసార్లు అప్‌డేట్‌ చేయాలి. అయితే, 2027 వరకు మీ పిల్లల ఆధార్‌ కార్డును ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా అప్‌డేట్‌ చేయించుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

aadhaar1/5

ఆధార్

ఆధార్‌ కార్డు మన దేశంలో ప్రతిఒక్కరూ తప్పకుండా కలిగి ఉంటారు. అయితే, పెద్దలతోపాటు పిల్లలకు కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి. స్కూలు అడ్మిషన్‌, బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలన్నా ఆధార్‌ తప్పనిసరి చేశారు. అయితే, ఐదేళ్లలోపు పిల్లలకు బ్లూ ఆధార్‌ కార్డు జారీ చేస్తారు. ఆ తర్వాత మాములు ఆధార్‌ కార్డు ఉంటుంది.
aadhaar biometric update2/5

ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

అయితే, ఐదేళ్లు, 15 ఏళ్ల వయస్సులో పిల్లల బయోమెట్రిక్‌ ఒకసారి అప్‌డేట్‌ చేసుకోవాలి. యూఐడీఏఐ ప్రకారం బయోమెట్రిక్‌ ఎప్పటికప్పుడు అప్‌టేట్‌గా ఉండాలి. కాబట్టి పిల్లలకు ఈ రెండుసార్లు అప్‌డేట్‌ చేయాలి.
free aadhaar update3/5

ఉచిత ఆధార్ అప్డేట్ 2027

2027 సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఉచితంగా ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయవచ్చు. పిల్లల చేతి వేళ్లు, ఐరిస్‌, ఫోటోగ్రాఫ్‌ అప్‌డేట్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేవను యూఐడీఏఐ ఉచితంగా అందిస్తోంది. మీ పిల్లలు 5 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటే 2027 సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రధానంగా పిల్లల బయోమెట్రిక్‌ అప్‌డేట్‌గా ఉండేలా చూడాలి.
uidai new rules4/5

ఆధార్ కార్డ్ కొత్త రూల్స్

పిల్లలకు ఆధార్‌ కార్డు మంజూరు చేసిన తర్వాత మొదటగా వారి నుంచి బయోమెట్రిక్‌ డేటా సేకరిస్తారు. వాళ్లు పెరుగుతున్న కొద్దీ వారి ఫీచర్స్‌లో మార్పులు ఉంటాయి. దీంతో వారి ఫింగర్‌ ప్రింట్స్‌, బయోమెట్రిక్‌ వివరాలు కూడా తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాలి. ఇది యూఐడీఏఐ నిబంధనల ప్రకారం జరగాలి. 5, 15 ఏళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. వీటితోపాటు ఆధార్‌ కార్డుపై ఫోటో కూడా అప్‌డేట్‌ చేయించాలి.
child aadhaar biometric update5/5

పిల్లల ఆధార్ కార్డ్ అప్డేట్ ఎలా చేయాలి

ఎక్కడ అప్‌డేట్‌ చేయించాలి? ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ అనేది సులభతర ప్రక్రియ. మీ దగ్గరలో ఉన్న ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందే. మీ పిల్లల ఆధార్‌ కార్డు వివరాలు కూడా ఉండాలి. పిల్లలకు ఫింగర్‌ప్రింట్‌, ఐరీస్‌ స్కాన్‌ కూడా చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌కు సంబంధించిన రిసీట్‌ కూడా జనరేట్‌ అవుతుంది.
TAGS:
Aadhaar Card
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.