ప్రతి ఒక్కరికీ మృదువైన, పట్టులాంటి మెరిసే జుట్టు కావాలని కోరిక ఉంటుంది. అయితే ప్రతిరోజూ మనం ఎదుర్కొనే కాలుష్యం, హెయిర్ స్టైల్స్, కెమికల్ ట్రీట్‌మెంట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల మెరిసే జుట్టును పొందడం కష్టమవుతోంది. కానీ ఇంట్లోనే కొన్ని చిన్న చిట్కాలతో మనం సులభంగా జుట్టును మెరిపించుకోవచ్చు. ఇంట్లో ఉండే కొబ్బరి నూనె, కలబంద, తేనె, పెరుగు మరియు గుడ్లను ఉపయోగించడం వల్ల జుట్టులోని తేమను కాపాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా మెరిసే జుట్టు లభిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
కొబ్బరి నూనెతో మసాజ్..
పట్టులాంటి మెరిసే జుట్టు కోసం కొబ్బరి నూనెను ఉపయోగించండి. చిన్నప్పటి నుండి మనందరికీ కొబ్బరి నూనె పెట్టుకోవడం అలవాటుగా ఉంది, కానీ ప్రస్తుత కాలంలో వారానికి ఒకసారి కూడా పెట్టుకోవడం కష్టమవుతోంది. స్నానానికి ముందు జుట్టుకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేయాలి. సుమారు 10 నిమిషాల పాటు లేదా ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టులోని తేమ అలాగే ఉంటుంది, జుట్టు బలంగా, నల్లగా పెరుగుతుంది.
2/5
కలబంద..
కలబంద వాడటం వల్ల జుట్టు సహజంగా బలంగా మారుతుంది. చిక్కులు పట్టిన జుట్టు సమస్యను కూడా తగ్గించవచ్చు. తాజా కలబందను తీసుకుని జుట్టు కుదుళ్ల నుండి అంతటికీ అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయండి. ఈ ఇంటి చిట్కా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరిసే జుట్టును పొందవచ్చు.
3/5
కోడిగుడ్డు మాస్క్..
కోడిగుడ్డును ఉపయోగించి కూడా జుట్టును మెరిపించవచ్చు. గుడ్డులో ఉండే ప్రోటీన్, బయోటిన్ జుట్టును కుదుళ్ల నుండి బలోపేతం చేస్తాయి. దీనివల్ల జుట్టు సహజంగా మెరుస్తుంది. ఒక గుడ్డును బాగా బీట్ చేసి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు అంతటికీ పట్టించండి. అరగంట తర్వాత చల్లని నీరు, షాంపూతో తలస్నానం చేయండి. దీనివల్ల మెరిసే జుట్టు లభిస్తుంది.
4/5
అరటిపండుతో..
అరటిపండులో పుష్కలంగా ఉండే పొటాషియం, విటమిన్లు మన జుట్టును మృదువుగా మారుస్తాయి. దీనివల్ల తక్షణమే మంచి ఫలితాలు, మెరుగైన టెక్స్చర్ లభిస్తాయి. బాగా పండిన అరటిపండును మెష్ చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టు అంతటికీ పట్టించండి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మెరిసే అందమైన జుట్టును పొందవచ్చు.
5/5
నిమ్మకాయతో.
నిమ్మకాయను ఉపయోగించి కూడా జుట్టును మెరిపించుకోవచ్చు. ఇది జుట్టులోని అదనపు నూనెను తొలగించి, డాండ్రఫ్ సమస్యను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది కాబట్టి, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టు అంతటికీ మసాజ్ చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.