Tirumala Pournami Garuda Seva: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న పౌర్ణమి సందర్భంగా తిరుమలలో అత్యంత అపూర్వంగా గరుడసేవ నిర్వహించారు. రాత్రి 7 గంటల సమయంలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్లప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం.
1/5
తిరుమల తిరుపతి దేవస్థానం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం, మొక్కులు చెల్లించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున గరుడసేవను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
2/5
తిరుమలలో గరుడసేవ
నిన్న సెప్టెంబర్ 26న పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
3/5
తిరుపతి
పౌరాణిక నేపథ్యం ప్రకారం, 108 వైష్ణవ క్షేత్రాలలో గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనంపై స్వామివారు విహరించడం ద్వారా తాను 'దాసాను దాస' అని తెలియజేస్తారు.
4/5
గరుడసేవ
తిరుమలలో ప్రతి పౌర్ణమి నాడు గరుడసేవ నిర్వహించే వెనుక ఒక విశిష్టత ఉంది. జ్ఞాన వైరాగ్యాలను కోరుకునే మానవులు, జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కల గల గరుడ స్వామిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కోటి ప్రజలకు తెలియజేయడమే ఈ గరుడసేవ ఉద్దేశం.
5/5
తిరుమల
తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ గరుడసేవలో శ్రీ చిన్న జీయర్ స్వామితో పాటు, టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు నిన్న పూర్ణాహుతితో ముగిశాయి.