భారతీయ హిందూ ఇళ్లలో పూజలు తప్పనిసరి. అయితే, కొంతమంది కేలండర్‌లు కూడా దేవుళ్ల ఫోటోలతో ఉన్నవి పెట్టుకుంటారు. అయితే, ఇంట్లో దేవుడి ఫోటోలు, కేలండర్‌లు కూడా పాతగా అవుతాయి. అప్పుడు వాటిని ఎక్కడ పారేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు..
1/5
దేవుడి ఫోటోల నిమజ్జన నియమాలు
ఇంట్లో దేవుడి పటాలు పాతగా మారాయా? ఇంట్లో పూజగదితోపాటు హాల్‌లో ఏర్పాటు చేసుకున్న దేవుడి కేలండర్ ఫోటోలు, చిత్రాలను ఎలా తీసేస్తున్నారు. వీటిని నేరుగా తీసి పారేయడం అశుభం. కొంతమంది ఇలా దేవుడి చిత్రాలను రోడ్లపై వదిలివేయడం, చెట్ల వద్ద లేదా దేవుడి గుడిలో పెట్టేస్తారు.
2/5
పాత దేవుడి క్యాలెండర్లు ఏం చేయాలి
అయితే, ఇలా ఎలా పడితే అలా వదిలేయడం మంచిది కాదు. ఇది శాస్త్రాల ప్రకారం మాత్రమే కాదు.. వాస్తు ప్రకారం కూడా అశుభమే.. మరి ఈ పాత్ర దేవుడి చిత్ర పటాలను ఏం చేయాలి?
3/5
దేవుడి ఫోటోలు తీసివేయడం ఎలా
సాధారణంగా దేవుడి చిత్రపటాలు, కేలండర్ కొన్ని రోజుల తర్వాత పాడవుతుంది. సనాతన ధర్మంలో పంచతత్వకు అగ్ని నీటితో ప్రాముఖ్యత ఉంది. ఇవి ప్రధానంగా శుద్ధీ చేస్తాయి. మొదట బయోడిగ్రేడబుల్ పేపర్‌తో తయారు చేసిన ఫోటోలు నీళ్లలో నిమజ్జనం చేయవచ్చు. ఒక వేళ అది ఫోటో ఫ్రేమ్ అయితే, దాని నుంచి ముందుగా ఫోటో తీసేయండి. ఆ తర్వాత కేవలం ఈ ఫోటోను మాత్రమే పారే నీటిలో నిమజ్జనం చేస్తే సరిపోతుంది.
4/5
పాత దేవుడి పటాల నిమజ్జనం పద్ధతి
ఇక నాన్ బయోడిగ్రడబుల్ విషయానికి వస్తే చెక్కతో తయారు చేసినవి. వాటిని అగ్నికి ఆహుతి ఇస్తారు. ఈ బూడిదను నీటిలో పోయడం లేదా చెట్టు కింద పూడ్వడం వంటివి చేయాలి. సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం ఏ పూజ వస్తువులను అయినా ఇష్ట వచ్చినట్టుగా వదిలేయకూడదు. ఇదే మన పూర్వీకుల చిత్ర పటాలకు కూడా చేయాలి.
5/5
పాత దేవుడి పటాలు
(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)