• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బ్యాంకింగ్‌ రంగానికి సైబర్‌ ముప్పు.. మోడీ..!! భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్‌ ఏర్పాటు..

బ్యాంకింగ్‌ రంగానికి సైబర్‌ ముప్పు.. మోడీ..!! భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్‌ ఏర్పాటు..

RBI data centre: ఆధునిక కాలంలో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా జరుగుతున్నాయన్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను సైబర్‌ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన డేటా సెంటర్‌, సైబర్‌ భద్రత శిక్షణ సంస్థను ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 01:07 PM IST|Updated: Oct 26, 2026, 01:10 PM IST
joinshare
బ్యాంకింగ్‌ రంగానికి సైబర్‌ ముప్పు.. మోడీ..!! భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్‌ ఏర్పాటు..
Image Credit: RBI Data Centre (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తుపానుకు ముందు ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే..

తుపానుకు ముందు ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే..

2

Lucknow: ఓర్నీ.. గుడిలో దేవుడికి దండం పెట్టి మరీ యువతి ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

3

Chiranjeevi Talk Show: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న మెగాస్టార్.. టాక్‌ షో కోసం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్

4

సెర్బియాలో సంచలనం.. విద్యార్థుల చేతిలో చిత్తుగా ఓడిన నియంత.. 14 ఏళ్ల వూచిక్ పాలనకు చరమగీతం..!!

5

10,000mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే.. వివో Y600 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

New Data Centre Located At Bhuvaneshwar: రూ. 169 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ  సెంటర్‌ ఒడిశాతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తుందన్నారు.  భువనేశ్వర్‌లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల భద్రతను బలోపేతం చేయడం, సైబర్‌ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో దీనిని ఏర్పాటు చేశారు.

169 కోట్ల ఖర్చుతో RBI డేటా సెంటర్‌ ఏర్పాటు..

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ భద్రతపై  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. భారత్‌ ఆర్థికంగా బలపడుతున్న తరుణంలో, మన బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ నేరస్థులు, సైబర్ ఉగ్రవాదుల నుంచి రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. నేడు, సైబర్ ముప్పుల రూపురేఖలు నిరంతరం మారుతున్నాయి. పాతబడిన వ్యవస్థలు, పాత శిక్షణా పద్ధతులు లేదా కాలం చెల్లిన సాధనాలతో ఈ కొత్త సవాళ్లను మనం ఎదుర్కోలేమన్నారు. మనకు ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. ఇక్కడే ఈ కొత్త సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని  ప్రధాని మోడీ అన్నారు.  

బ్యాంకింగ్‌ రంగానికి సైబర్‌ ముప్పు: మోడీ..

గత పదేళ్లలో బ్యాంకింగ్‌ సేవలు అందని వర్గాలకు వాటిని చేరువ చేయడంపై దృష్టి సారించామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక రానున్న దశాబ్దంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత సమర్థంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉండటమే కాకుండా, వాటిని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకునేలా చూడాలని అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ లావాదేవీల భద్రత, వేగవంతమైన సేవలు, ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం భవిష్యత్తులో కీలకమన్నారు ప్రధాని మోడీ.     

 

Add Zee News as a Preferred Source
TAGS:
Reserve Bank of India
PM Modi
National News