• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Hyderabad Wholesale Markets: డీమార్ట్‌ కంటే తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయా? హైదరాబాద్‌లో ఈ మార్కెట్లను మిస్ అవకండి!

Hyderabad Wholesale Markets: డీమార్ట్‌ కంటే తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయా? హైదరాబాద్‌లో ఈ మార్కెట్లను మిస్ అవకండి!

Written ByVishnu Priya
Published: Oct 16, 2026, 09:44 AM IST|Updated: Oct 16, 2026, 09:50 AM IST
joinshare

Hyderabad Wholesale Markets: హైదరాబాద్‌లో నెలవారీ ఇంటి సరుకులు కొనాలంటే చాలామంది డీమార్ట్‌, మెట్రో వంటి సూపర్‌మార్కెట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే నగరంలో మరికొన్ని ప్రత్యేక మార్కెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బియ్యం, పప్పులు, మసాలా దినుసుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి నిర్మాణ సామగ్రి వరకు అనేక రకాల వస్తువులు లభిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో సరుకులు కొనేవారు ఈ మార్కెట్లలో ధరలు పోల్చి చూసి డబ్బు ఆదా చేసుకోవచ్చు.
 

cheap shopping in Hyderabad1/5

హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్లు

మలక్‌పేట మార్కెట్: బియ్యం, పప్పులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పసుపు, చింతపండు, అల్లం, వెల్లుల్లి వంటి వంటింటి సరుకుల కోసం ఈ మార్కెట్‌ను సందర్శించవచ్చు. మహారాజ్‌గంజ్‌, ముక్త్యార్‌గంజ్‌: వివిధ రకాల పప్పులు, కిరాణా వస్తువులు కొనుగోలు చేయడానికి ఇక్కడి టోకు దుకాణాలు ఉపయోగపడతాయి.
 Hyderabad wholesale prices2/5

ఇంటి సరుకులకు ఈ మార్కెట్లు బెస్ట్!

గౌలీపురాలోని దాల్‌ మిల్లుల్లో కూడా పప్పుల ధరలు తెలుసుకోవచ్చు. బేగంబజార్‌: మసాలా దినుసులు, డ్రైఫ్రూట్స్‌, ప్లాస్టిక్ వస్తువులు, స్టీలు, రాగి, ఇత్తడి పాత్రలు వంటి అనేక వస్తువులు ఇక్కడ లభిస్తాయి.
 Hyderabad wholesale markets3/5

బట్టలు, చెప్పులు కొనాలంటే ఎక్కడికి వెళ్లాలి?

తక్కువ ధరలకు దుస్తులు కొనాలనుకునేవారు పత్థర్‌ఘట్టి మార్కెట్‌ను పరిశీలించవచ్చు. ఇక్కడ రెడీమేడ్ దుస్తులు, చీరలు, షర్టింగ్‌, సూటింగ్‌ వస్త్రాలు లభిస్తాయి. చెప్పులు, షూస్‌ కోసం చత్తా బజార్‌ను సందర్శించవచ్చు. సికింద్రాబాద్‌లోని టొబాకో బజార్‌లో చీరలు, దోతులు, లుంగీలు, బెడ్‌షీట్లు, తువ్వాళ్లు కొనుగోలు చేయవచ్చు. మొబైల్‌ యాక్సెసరీల కోసం ఆబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌ ఉపయోగపడుతుంది.
Hyderabad markets for clothes4/5

ఎలక్ట్రానిక్స్‌, ఇంటి నిర్మాణ వస్తువులు

ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్‌ యాక్సెసరీల కోసం గుజరాతీగల్లీ, పార్క్‌లేన్‌ ప్రాంతాలను పరిశీలించవచ్చు. ఎలక్ట్రికల్‌ సామగ్రి, వైరింగ్‌ వస్తువుల కోసం ట్రూప్‌ బజార్‌ మంచి ఎంపిక. టైల్స్‌, శానిటరీ వస్తువుల కోసం కింగ్స్‌వే ప్రాంతాన్ని, పెయింట్లు, హార్డ్‌వేర్‌, నీటి పంపుల కోసం రాణీగంజ్‌ను పరిశీలించవచ్చు. ప్లైవుడ్‌, గ్లాస్‌, అలంకరణ షీట్ల కోసం గోషామహల్‌లో ధరలు తెలుసుకోవచ్చు.
Hyderabad electronics market5/5

పండ్లు, పూలు, చేపలకు ప్రత్యేక మార్కెట్లు

చేపల కోసం రాంనగర్‌, ఫీల్‌ ఖానా ప్రాంతాలను పరిశీలించవచ్చు. పండ్ల టోకు కొనుగోళ్లకు గడ్డి అన్నారం, ఎల్‌బీ నగర్‌ మార్కెట్లు ఉపయోగపడతాయి. పూల కోసం గుడిమల్కాపూర్‌, మెహదీపట్నం ప్రాంతాలను సందర్శించవచ్చు. అయితే అన్ని వస్తువులు ఈ మార్కెట్లలోనే తక్కువ ధరకు లభిస్తాయని చెప్పలేం. కొనుగోలు చేసే ముందు రెండు మూడు దుకాణాల్లో ధరలు తెలుసుకోవాలి. డీమార్ట్‌, మెట్రో, స్థానిక షాపుల ధరలతో పోల్చిన తర్వాతే కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
TAGS:
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

2

అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

3

దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

4

PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

5

ఒకే మహిళ.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆధార్ లింకింగ్‌తో దొరికిపోయిందిలా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.