Janhvi Kapoor: జాన్వీ కపూర్ తనకు ఉన్న ఓ విచిత్రమైన టాలెంట్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన నాలుకను దాదాపు 360 డిగ్రీల వరకు తిప్పగలనని వెల్లడించింది. చిన్నప్పుడు ఈ టాలెంట్‌ను గుర్తించినట్లు చెప్పడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
1/5
జాన్వీ కపూర్ తాజా వార్తలు
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలు, నటన, గ్లామర్ లుక్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అయితే తాజాగా జాన్వీ చెప్పిన ఒక విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనకు ఉన్న ఒక విచిత్రమైన టాలెంట్ గురించి ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
2/5
జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్
ఇంతకీ జాన్వీకి ఉన్న ఆ టాలెంట్ ఏంటంటే.. ఆమె తన నాలుకను దాదాపు 360 డిగ్రీల వరకు తిప్పగలదట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన గురించి చాలామందికి తెలియని టాలెంట్ ఏదైనా ఉందా అని అడిగినప్పుడు జాన్వీ ఈ సమాధానం ఇచ్చింది. అయితే తన టాలెంట్ గురించి జాన్వీ చాలా సీరియస్‌గా చెప్పలేదు. ఇది చాలా పనికిరాని, వింతైన టాలెంట్ అని ఆమె సరదాగా చెప్పింది. అయినప్పటికీ ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది జాన్వీ చెప్పిన ఈ టాలెంట్ గురించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
3/5
జాన్వీ కపూర్ దేవర
తనకు ఈ టాలెంట్ చిన్నప్పుడే తెలిసిందని జాన్వీ చెప్పింది. స్కూల్‌లో ఉన్న సమయంలో తన క్లాస్‌మేట్స్ నాలుకను ముక్కుకు తాకించేందుకు ప్రయత్నించేవారట. చాలామంది పిల్లలు దీనిని ఒక ప్రత్యేకమైన టాలెంట్‌లా చూపించేవారు. అయితే జాన్వీ మాత్రం అలా చేయలేకపోయేదట. దాంతో తన నాలుకతో తాను ఏదైనా వింతగా చేయగలనా అని జాన్వీ ప్రయత్నించిందట. అలా ప్రయత్నిస్తున్న సమయంలో తన నాలుకను వేరే విధంగా తిప్పగలిగే విషయం ఆమెకు తెలిసింది. ఆ తర్వాత దీనిని సరదాగా పార్టీ ట్రిక్‌లా కూడా ఉపయోగించేదట.
4/5
జాన్వీ కపూర్ చుట్టమల్లే
ఇప్పుడు జాన్వీ చెప్పిన ఈ విషయం నెటిజన్లకు బాగా ఆసక్తిని కలిగిస్తోంది. కొంతమంది ‘వావ్.. ఏం టాలెంట్ జాన్వీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తాము కూడా నాలుకను అలా తిప్పేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ అది చాలా కష్టంగా ఉందని సరదాగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఇటీవల మరో కారణంతో కూడా వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన ఓ AI మానిప్యులేటెడ్ వీడియో సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఈ వీడియోపై జాన్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
5/5
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్
AI టెక్నాలజీని ఉపయోగించి మహిళలను తప్పుగా చూపించడం సరికాదని ఆమె చెప్పింది. అలాగే ఎవరి అనుమతి లేకుండా మార్పులు చేసిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా బాధాకరమైన విషయమని పేర్కొంది. దీంతో జాన్వీ ప్రస్తుతం తన సినిమాలతో పాటు ఈ రెండు విషయాల కారణంగా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆమె నాలుకను 360 డిగ్రీలు తిప్పగలదనే విషయం మాత్రం నెటిజన్లకు కొత్తగా అనిపిస్తోంది.