• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Indian Railways Warning: ట్రైన్‌లో ఈ తప్పు చేస్తే ఇక జైలే.. రూ. 1,000 ఫైన్‌తో పాటు కఠిన చర్యలు!

Indian Railways Warning: ట్రైన్‌లో ఈ తప్పు చేస్తే ఇక జైలే.. రూ. 1,000 ఫైన్‌తో పాటు కఠిన చర్యలు!

Written ByRenuka Godugu
Published: Nov 21, 2026, 14:13 IST|Updated: Nov 21, 2026, 14:17 IST
joinshare

Indian Railways Warning: ఇటీవలె సదరన్‌ రైల్వే ట్రైన్‌లో పెద్దగా అరవడం వంటివి చేస్తే ఫైన్‌ విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈస్టర్న్‌ రైల్వే కూడా రైలు పెద్ద మ్యూజిక్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు పెట్టినా, ఫోన్‌కాల్స్‌లో ఇతరులకు ఇబ్బందులు పెట్టేలా అరుస్తూ మాట్లాడినా ఫైన్‌ విధించనుంది. ఈ పనులు చేస్తే రూ.1000 ఫైన్‌ లేదా ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

train travel rules 1/5

రైలు ప్రయాణ నియమాలు

భారతీయ రైల్వే ఎప్పుడూ సులభతర ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, ఇకపై రైలు ప్రయాణంలో పెద్ద శబ్దాలు చేస్తే ఫైన్‌ కూడా విధించనున్నారు. పెద్ద శబ్దాలు, లౌడ్‌ స్పీకర్స్‌, అరస్తూ ఫోన్‌ మాట్లాడితే రైల్వే యాక్ట్‌ 1989 ప్రకారం రూ.1000 ఫైన్‌ విధించనుంది. లేదా ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు.
playing music without earphones on train2/5

ట్రైన్ లో పాటలు వింటే జరిమానా

ఇలాంటి చర్యలకు పాల్పడితే సెక్షన్‌ 145 ఇండియన్‌ యాక్ట్‌ 1989 ప్రకారం శిక్షకు అర్హులు. టిక్కెట్‌ చెక్‌ చేసే రైల్వే సిబ్బంది ఇలాంటి ఇబ్బందికర చర్యలు పాల్పడితే వారు చెక్‌ చేసి యాక్షన్‌ తీసుకోనున్నారు.
Railway3/5

రైల్వే

ఇలా పెద్ద శబ్దాలు చేస్తే ఇతర ప్రయాణీకులకు ఇబ్బందికరం. రైలు వాతావరణం కూడా పూర్తిగా అసౌకర్యంగా మారుతుంది. ప్రధానంగా ఏసీ కోచ్‌లలో కొద్దిగా మాట్లాడినా పెద్దగా వినిపిస్తుంది.
indian railway4/5

భారతీయ రైల్వే

భారతీయ రైల్వేలో పనిచేసేవారు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ప్రయాణీకులకు కూడా మరింత అవగాహన దీనిపై పెంచడానికి ఈస్టర్న్‌ రైల్వే ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది కూడా.
Indian Railways Warning5/5

ఇండియన్ రైల్వే వార్నింగ్

స్థానిక భాషల్లో కూడా పెద్ద అనౌన్స్‌మెంట్స్‌ చేసి ప్రయాణీకులకు ఈ యాక్ట్‌ గురించి అవగాహన కల్పిస్తోంది. ట్రైన్‌లో మాత్రమే కాదు రైల్వే స్టేషన్‌లో కూడా దీనిపై అవేర్నెస్‌ తీసుకువస్తోంది. ఫోన్‌ మాట్లాడితే ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకోవాలి.
TAGS:
Indian Railways
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.