Grand Vitara EMI Plan: మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కారును ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం దసరా సందర్భంగా అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ వివరాలను అందించబోతున్నాము.. ఈ వివరాల ప్రకారం.. ప్రతినెల కేవలం రూ. 16,000 మాత్రమే ఈఎంఐ కట్టుకోవచ్చు..
Maruti Suzuki Grand Vitara Emi: భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ (SUV) కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలామంది ఇలాంటి కార్లనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ విభాగంలో మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన ప్రజాధరణ సొంతం చేసుకుంది. ప్రీమియం లుక్కుతో దిమ్మతిరిగే మైలేజీ తో అందుబాటులోకి వచ్చిన ఈ కారును ఇప్పుడు చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎప్పటినుంచో మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా ఈఎంఐ ఆప్షన్ లో.. ఈ బడ్జెట్ ప్లానింగ్ వివరాలు మీకోసమే..
1/5
బడ్జెట్ ప్లాన్
అయితే, ఈ బడ్జెట్ ప్లాన్ చేతిలో తగినంత డబ్బు ఉన్నవారికి వర్తిస్తుంది. నాలుగేళ్లు లోన్ క్లియర్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో అనుకూలమైందిగా భావించవచ్చు. కేవలం ప్రతినెల రూ.16 వేల ఈఎంఐ తో దీనిని కొనుగోలు చేయడం చాలా బెస్ట్ అని మార్కెట్ నిపుణులు సైతం చెబుతున్నారు.
2/5
వడ్డీ రేటు
నాలుగేళ్ల సమయంలో తీసుకున్న బ్యాంకు లోన్ కి 9.20 వడ్డీ రేటు అనుకుంటే.. మీరు మొత్తం రూ.7,62,528 చెల్లించాల్సి ఉంటుంది. అంటే అసలు కాకుండా నాలుగేళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ సుమారు రూ.1,26,585 మాత్రమే అవుతుంది. నాలుగేళ్లలో ఇంత తక్కువ వడ్డీతో ఈ కారును కొనుగోలు చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ గా భావించవచ్చు..
3/5
రూ. 7,30,000 డౌన్‌పేమెంట్
రూ. 7,30,000 డౌన్‌పేమెంట్‌గా చెల్లిస్తే.. మిగిలిన రూ. 6,35,943 మొత్తాన్ని బ్యాంకు లోన్ అందిస్తుంది. అయితే, ఇప్పుడున్న బ్యాంకుల వడ్డీ రేటు ప్రకారం ఈ కారుపై సంవత్సరానికి 9.20 శాతం వరకు వడ్డీ శాతం అనుకుంటే.. 48 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకునే వారికి.. ప్రతినెల కేవలం రూ. 15,886 ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది.
4/5
మారుతి సుజుకి గ్రాండ్ విటారా
హైదరాబాద్ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 13,65,943 తో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు కూడా 53 శాతం పైగా అంటే ఏడు లక్షల ముప్పై వేలు డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా అమౌంట్‌ని ఇఎంఐ ఆప్షన్ చూజ్ చేసుకొని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్ బడ్జెట్ ఈఎంఐ ప్లానింగ్ గా భావించవచ్చు..
5/5
మారుతి సుజుకి గ్రాండ్ విటారా
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కారు ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న సిగ్మా పెట్రోల్ వేరియంట్ అత్యంత తక్కువ ధరలోనే లభిస్తుంది. అంతేకాకుండా దీనిని మంచి డౌన్ పేమెంట్ తో తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా బడ్జెట్ ప్లానింగ్ వివరాలు అందుబాటులో ఉన్నాయి.