• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Woman Cobra Selfie Video: ఓ మహిళ మెడలో పామును వేసుకుని సెల్ఫీ వీడియో తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్‌గా మారింది. ప్రమాదకరమైన పామును పట్టుకొని ఇలా.. హింసించడం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 02:54 PM IST|Updated: Oct 18, 2026, 02:57 PM IST
joinshare
మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

2

Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

3

YS Jagan: ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

4

వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

5

మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman Cobra Selfie Video: సోషల్ మీడియా ప్రపంచంలో వ్యూస్ తో పాటు లైకులు ఫాలో వల్ల కోసం కొందరు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతటి సాహసానికైనా రెడీ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ పిచ్చి చేష్టాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. సాధారణంగా ఒక పాము కనిపిస్తేనే ఎంతో దూరం పరుగులు తీసే జనాలు.. ఓ మహిళ ఏకంగా భయంకరమైన నాగుపామును మెడలో వేసుకొని సెల్ఫీ వీడియో రికార్డు చేయడం సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇప్పుడు ఈ ఘటన చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ అత్యంత విషపూరితమైన నల్లటి నాగుపామును పూలదండలా.. మెడ చుట్టూ వేసుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆమె చేతిలో ఫోన్ పట్టుకుని సెల్ఫీ కెమెరా వైపు చూస్తూ వీడియో తీస్తుండగా.. ఆ నాగుపాము ఆమె మెడ పై అటు ఇటు కదులుతూ పడక విప్పడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అది ఎప్పుడైనా దాడి చేసేలా క్షణక్షణం గుసలు కొడుతూ కనిపించడం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఏమాత్రం అటు ఇటు పొరపాటున కంటి రెప్పపాటు తేడాతో వచ్చి నేరుగా ముఖంతో పాటు మెడపై కాటు వేసే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆ మహిళ మాత్రం అస్సలు బెదరకుండా వీడియో తీస్తూ ఉండడం మీరు చూడొచ్చు.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ. ఇటీవల సోషల్ మీడియాలో ఊహించని రీతిలో లక్షలాది వ్యూస్తో మళ్ళీ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అయితే.. రెచ్చిపోయి మరీ కామెంట్లు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో హైప్ సాధించడానికి ఇలా విష్ణు సర్పాలతో ఆటలాడడం అస్సలు మంచిది కాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు సైతం కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఇది ధైర్యం కాదు ముమ్మాటికి ప్రాణాలతో చెలగాటమే అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యువతను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని.. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని కొందరు కామెంట్లలో తెలుపుతున్నారు..

సాధారణంగా చాలామంది పాములను చూస్తేనే భయపడిపోతూ ఉంటారు.. అలాంటిది ఈ మహిళ ఏమాత్రం భయపడకుండా పాముని పట్టుకొని ఆడడం చూస్తుంటే.. ఇది పెంపుడుపామని అర్థం అయిపోతోంది.. చాలామంది పాములు పట్టేవారు ఎక్కువగా ఇలా పెంచుకుంటారని.. వాటి ద్వారా వారు డబ్బులు సంపాదిస్తారని కొంతమంది చెబుతూ వస్తున్నారు. అయితే, ఇలా పామును హింసించడం అస్సలు మంచిది కాదని వన్యప్రాణి సంరక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తున్న ఈ మహిళపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారంటున్నారు.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Arti Devi (@artisapera9)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News