• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇంత పని చేసావ్ ఏంటి బాబు..!

Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇంత పని చేసావ్ ఏంటి బాబు..!

Written ByVishnu Priya
Published: Sep 17, 2026, 02:51 PM IST|Updated: Sep 17, 2026, 03:02 PM IST
joinshare

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ఫౌజీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త కథ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
 

Prabhas Fauzi1/5

ఫౌజీ సినిమా అప్‌డేట్

ప్రభాస్ పౌజి సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఫౌజీ సినిమా షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను పరిశీలించిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా సినిమాలో కీలకంగా ఉండే కొన్ని సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్లను పూర్తి చేయాల్సి ఉందని సమాచారం.
Prabhas Fauzi release date2/5

ఫౌజీ రిలీజ్ వాయిదా

సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలి ఉందని తెలుస్తోంది. దీనితో పాటు మరో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించాల్సి ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం సుమారు 30 నుంచి 40 రోజుల సమయం అవసరం కావచ్చని సమాచారం. అందుకే షూటింగ్ పూర్తయ్యే వరకు విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Fauzi movie3/5

ప్రభాస్ కొత్త సినిమా

ఇప్పటికే ఫౌజీకి సంబంధించిన విడుదల తేదీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే షూటింగ్ పనులు పూర్తికాకముందే డేట్ ప్రకటిస్తే, తర్వాత మళ్లీ మార్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 Prabhas upcoming movie4/5

ఫౌజీ కొత్త విడుదల తేదీ

ప్రభాస్ సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉంది. అందువల్ల విడుదల తేదీని నిర్ణయించేటప్పుడు ఇతర పెద్ద సినిమాల రిలీజ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగ సీజన్, థియేటర్ల లభ్యత, ఇతర స్టార్ హీరోల సినిమాల తేదీలు వంటి అంశాలు కూడా కీలకంగా మారుతాయి.
Hanu Raghavapudi Fauzi5/5

ప్రభాస్ మూవీ అప్‌డేట్

ప్రస్తుతం ఫౌజీ కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాతే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే విషయంపై అధికారిక సమాచారం కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూడాల్సిందే.
TAGS:
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.