• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Oil Free Crispy Pooris: ఎయిర్ ప్రైయర్ లేకుండా కూడా నూనె పీల్చని పూరీలు ఎలా చేయాలో తెలుసా..

Oil Free Crispy Pooris: ఎయిర్ ప్రైయర్ లేకుండా కూడా నూనె పీల్చని పూరీలు ఎలా చేయాలో తెలుసా..

Written ByVishnu Priya
Published: Sep 23, 2026, 04:17 PM IST|Updated: Sep 23, 2026, 04:26 PM IST
joinshare
ఎయిర్ ఫ్రైయర్ అవసరం లేకుండానే పూరీలు ఎక్కువగా నూనె పీల్చుకోకుండా కరకరలాడేలా ఎలా చేయాలో తెలుసా? పిండిలో ఈ ఒక్క పదార్థాన్ని కలిపి, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

Puri Making Tips: పూరీలు వేయించిన వెంటనే నూనెతో తడిసిపోతున్నాయా? ఇక ఆ సమస్య ఉండదు. పూరీ పిండి తయారీ నుంచి నూనె వేడి వరకు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే గుల్లగా, కరకరలాడే పూరీలు తయారు చేసుకోవచ్చు.
 

 Poori Recipe1/5

పూరీ పిండి చిట్కాలు

పూరీ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమైన టిఫిన్. వేడి వేడి పూరీలను బంగాళాదుంప కూరతో తింటే రుచి అదిరిపోతుంది. అయితే ఇంట్లో పూరీలు తయారు చేసేటప్పుడు ఒక సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. పూరీలు నూనెను ఎక్కువగా పీల్చుకోవడం, కొద్దిసేపటికే మెత్తగా మారడం వంటివి జరుగుతుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే పూరీలు తక్కువ నూనెతోనే కరకరలాడుతూ, బాగా పొంగేలా తయారు చేసుకోవచ్చు.
Crispy Poori2/5

పూరీ వంటకం

పూరీ పిండిలో బొంబాయి రవ్వ లేదా సూజీ కలపడం ఒక ముఖ్యమైన చిట్కా. రెండు కప్పుల గోధుమపిండికి సుమారు రెండు టేబుల్ స్పూన్ల రవ్వ కలిపితే పూరీలు మంచి టెక్స్చర్‌తో వస్తాయి. రవ్వ పిండిలోని తేమను కొంత నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో పూరీలు వేయించేటప్పుడు ఎక్కువగా నూనె పీల్చుకునే అవకాశం తగ్గుతుంది. రవ్వ అందుబాటులో లేకపోతే కొద్దిగా శనగపిండి కూడా ఉపయోగించవచ్చు.
 Soft Puri3/5

నూనె తక్కువగా పీల్చే పూరీలు

ఇక పూరీ పిండిని చపాతీ పిండిలా చాలా మెత్తగా కలపకూడదు. కొద్దికొద్దిగా నీటిని పోస్తూ గట్టిగా పిండి కలుపుకోవాలి. పిండి కలిపే సమయంలో ఒక చిన్న స్పూన్ వేడి నూనె లేదా నెయ్యి వేసుకుంటే పూరీలు మంచి టెక్స్చర్‌తో వస్తాయి.
 Homemade Puri4/5

ఇంట్లో పూరీలు

మరో ముఖ్యమైన విషయం పిండిని ఎక్కువసేపు నానబెట్టకపోవడం. పూరీ పిండిని గంటల తరబడి ఉంచాల్సిన అవసరం లేదు. పిండి కలిపిన తర్వాత సుమారు 10 నుంచి 15 నిమిషాల్లో పూరీలు చేసుకోవచ్చు. పూరీలు ఒత్తేటప్పుడు ఎక్కువగా పొడి పిండి ఉపయోగించకపోవడం మంచిది. బదులుగా పీటకు, లట్టణానికి కొద్దిగా నూనె రాసుకుని పూరీలను ఒత్తుకోవచ్చు. పూరీ మరీ పలుచగా లేదా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి.
Puri Without Air Fryer5/5

పూరీ కుకింగ్ టిప్స్

ఇక నూనె వేడి కూడా చాలా ముఖ్యం. నూనె సరిగ్గా వేడెక్కకపోతే పూరీలు ఎక్కువ నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది. నూనెలో చిన్న పిండి ముక్క వేసినప్పుడు అది వెంటనే పైకి తేలితే నూనె సరైన వేడిలో ఉన్నట్లు అర్థం. పూరీని నూనెలో వేసిన వెంటనే గరిటెతో తేలికగా నొక్కితే అది బాగా పొంగుతుంది. రెండు వైపులా వేగంగా వేయించి బంగారు రంగు వచ్చిన వెంటనే బయటకు తీసేయాలి. ఇలా పిండిలో కొద్దిగా రవ్వ కలపడం, పిండిని గట్టిగా కలపడం, నూనెను సరైన వేడిలో ఉంచడం వంటి చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే మంచి పూరీలు తయారు చేసుకోవచ్చు.
TAGS:
Home Remedies

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.