• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Rashmika Mandanna Bathukamma: తెలంగాణ కోడలిగా రష్మిక మందన్నా తొలి బతుకమ్మ.. ఫొటోలు వైరల్‌

Rashmika Mandanna Bathukamma: తెలంగాణ కోడలిగా రష్మిక మందన్నా తొలి బతుకమ్మ.. ఫొటోలు వైరల్‌

Written By Ravi Kumar Sargam
Published: Oct 19, 2026, 12:01 AM IST|Updated: Oct 19, 2026, 12:13 AM IST
joinshare
Rashmika Mandanna Bathukamma: తెలంగాణ సినీ నటుడు విజయ్‌ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత తొలిసారి నటి రష్మిక మందన్నా తెలంగాణ కోడలిగా తొలిసారి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో రష్మిక మందన్నా బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఆ ఫొటోలు చూసేయండి.

Rashmika Mandanna Bathukamma: తెలంగాణ సినీ నటుడు విజయ్‌ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత తొలిసారి నటి రష్మిక మందన్నా తెలంగాణ కోడలిగా తొలిసారి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో రష్మిక మందన్నా బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఆ ఫొటోలు చూసేయండి.

Rashmika Mandanna Bathukamma1/8

Rashmika Mandanna Bathukamma

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌ నటుడు తెలంగాణకు చెందిన విజయ్‌ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్నాతో కలిసి తొలిసారి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోడలిగా రష్మిక తొలిసారి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. ఆ ఫొటోలు మీరే చూసేయండి.
Rashmika Bathukamma2/8

Rashmika Bathukamma

హైదరాబాద్‌లోని ట్యాక్‌బండ్‌లో బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజు ఆదివారం సద్దుల బతుకమ్మ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున నగర ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు పూలవనంగా మారాయి.
Saddula Bathukamma3/8

Saddula Bathukamma

తెలంగాణ నటుడు విజయ్‌ దేవరకొండను వివాహం చేసుకున్న అనంతరం రష్మిక మందన్నా తొలిసారి దసరా పండుగ, బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక మందన్నా తొలిసారి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పండుగలో పాల్గొన్నారు.
Saddula Bathukamma4/8

Saddula Bathukamma

సంప్రదాయ వస్త్రధారణ ధరించి.. నిండుగా ఆభరణాలు ధరించి రష్మిక మందన్నా ఎంతో ప్రత్యేకంగా ముస్తాబయ్యారు. రష్మికకు తోడు విజయ్‌ దేవరకొండ సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. వారిద్దరూ సద్దుల బతుకమ్మలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Saddula Bathukamma5/8

Saddula Bathukamma

తన భార్య రష్మిక మందన్నాకు పెళ్లయిన కొన్ని వారాలకే బతుకమ్మ ఆడించాలని నిర్ణయించుకున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలిపారు. అందుకే అతి పెద్దగా జరుపుకునే ట్యాంకుబండ్‌ బతుకమ్మ ఉత్సవాల్లో రష్మికను తీసుకువచ్చినట్లు విజయ్‌ వెల్లడించారు.
Rashmika Bathukamma6/8

Rashmika Bathukamma

మహిళలతో కలిసి రష్మిక మందన్నా ఎంతో అందంగా బతుకమ్మ ఆడారు. తొలిసారి బతుకమ్మ ఆడినా ఎంతో చక్కగా ఆమె బతుకమ్మ ఆడడమే కాకుండా పాటలు పాడేందుకు ప్రయత్నించారు. వెంటనే నేర్చుకున్న రష్మిక అనంతరం చాలా సునాయాసంగా బతకమ్మ ఆడారు.
Crackers In Bathukamma7/8

Crackers In Bathukamma

వేడుకల్లో పాల్గొన్న మహిళలు విజయ్‌ దేవరకొండతో కూడా బతుకమ్మ ఆడించారు. రష్మికతో కలిసి విజయ్‌ బతుకమ్మ ఆడి సందడి చేశారు. బతుకమ్మ వేడుకల్లో కెమెరాల కళ్లన్నీ విజయ్‌ దేవరకొండ, రష్మిక దంపతులపైనే ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Fire Crackers in Bathukamma8/8

Fire Crackers in Bathukamma

బతుకమ్మ ఉత్సవాల్లో ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేడుకల అనంతరం బాణాసంచా కాల్చగా వెలుగులు జిలుగులు నింపాయి. బతుకమ్మ ఉత్సవాలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు పండుగ వాతావరణంలో మునిగాయి.
TAGS:
Tollywood
Telangana News
Trending News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

2

Saddula Bathukamma: వైభవంగా సద్దుల బతుకమ్మ.. పూలసంద్రంగా మారిన ట్యాంక్‌బండ్‌

3

రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

4

వరి దిగుబడులు బాగున్నా.. బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

5

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.