Prabhas Net Worth: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తో ప్యాన్ ఇండియా రేంజ్ ఎపుడో దాటి పోయాడు. అంతేకాదు వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతని మొత్తం ఆస్తుల విలువ ఎంతో చూద్దాం.
1/5
ప్రభాస్ అస్సెట్స్ వాల్యూ
Prabhas Assets Value: దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. . ఆయన ఎంట్రీ ఇచ్చినపుడు ఇతను మన ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అవుతాడని బహుశా ఎవరు అంచనా వేసి ఉండరు ఒక ఒక్కో చిత్రంతో తన రేంజ్ ను పెంచుకుంటూ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్.
2/5
ప్రభాస్
‘వర్షం’ సినిమాతో తొలి హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాతో టాలీవుడ్ లో తిరుగలేని మాస్ హీరోగా నిలబడ్డారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బాహుబలి సిరీస్’తో తెలుగు ప్రేక్షకులతో పాటు ప్యాన్ ఇండియా ఆడియన్స్ మనసులను దోచుకున్నాడు. ఈ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ గ్లోబల్ లెవల్‌కి పాకింది. ఇక బాహుబలి సినిమా తర్వాత కొన్నేళ్లు వరుస ఫ్లాపులతో సతమతమైన ప్రభాస్ ‘సలార్’తో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో కొలువైన తొలి తెలుగు, దక్షిణాది నటుడుగా పేరు రికార్డు క్రియేట్ చేశాడు.
3/5
2 వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్
ఇక ‘కల్కి 2898 AD’ చిత్రంతో మరోసారి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు. దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి రెండు చిత్రాలతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ ది స్వతహాగా రాజుల ఫ్యామిలీ. ప్రభాస్‌కు కు వారసత్వంగా వందల కోట్లు ఆస్తులు దఖలు పడ్డట్టు ఆయన సన్నిహితులు చెబుతున్న సమాచారం. ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందనేది ఆయన మిత్రులు, శ్రేయోభిలాసులు చెబుతున్న మాట. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్.. ఇక సినిమాల పరంగా దాదాపు రూ. 500 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తుంది.
4/5
ప్రభాస్ హౌసెస్
అంతేకాదు ప్రభాస్ కు కుటుంబ వారసత్వంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అంతేకాదు పలు గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణేతో లాంటి మహా నగరాల్లో కొన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయట. అటు విదేశాల్లో లండన్, అమెరికాల్లో సొంత ఇల్లున్నాయి.
5/5
ప్రభాస్ కార్స్
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు, ల్యాండ్ రోవర్, లాంబోర్గిని అవెంటేడర్ రోడస్టర్ కారు, రేంజ్ రోవర్ కార్లు ఇలా టాప్ మోడల్ కార్లన్ని ఆయన గ్యారేజీలో ఉన్నాయి. ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న ప్రభాస్ యేడాది సంపాదన సరాసరి రూ. 250 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. లాస్ట్ ఇయర్ ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో మెరిసిన ప్రభాస్.. ఈ యేడాది ‘ది రాజాసాబ్ ’సినిమాతో పలకరించారు. వచ్చే యేడాది ‘ఫౌజీ’ ‘స్పిరిట్’ మూవీస్‌తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.