• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Samantha Ruth Prabhu: సమంత డ్రీమ్ మెనూ ఇదే.. ఇడ్లీ, పెరుగన్నం, దోశ అంటే అంత ఇష్టమా?

Samantha Ruth Prabhu: సమంత డ్రీమ్ మెనూ ఇదే.. ఇడ్లీ, పెరుగన్నం, దోశ అంటే అంత ఇష్టమా?

Written ByVishnu Priya
Published: Sep 17, 2026, 09:59 PM IST|Updated: Sep 17, 2026, 10:08 PM IST
joinshare

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో కొత్త దశను ఆస్వాదిస్తున్న సమంత.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె తనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
 

Samantha dream menu,1/5

సమంత ఇష్టమైన ఆహారం

ప్రస్తుతం సమంత సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోలో ఆమె తన ఫుడ్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడింది. జీవితాంతం ఒకే రకమైన ఆహారం తినాల్సి వస్తే ఏం ఎంచుకుంటారని ఆమెను అడిగారు. దీనికి సమంత తనకు ఎంతో ఇష్టమైన మూడు సౌత్ ఇండియన్ వంటకాలను చెప్పింది.
Samantha idli2/5

సమంత ఇడ్లీ

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమని సమంత తెలిపింది. మధ్యాహ్నం భోజనంలో పెరుగన్నం తినడానికి ఇష్టపడతానని చెప్పింది. ఇక రాత్రి వేళ వేడి వేడి దోశ తన ఫేవరెట్ అని వెల్లడించింది. ఇలా ఇడ్లీ, పెరుగన్నం, దోశ తన డ్రీమ్ మెనూగా ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
Samantha curd rice3/5

సమంత పెరుగన్నం

సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమ డైట్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే సమంత చెప్పిన ఈ ఫుడ్ లిస్ట్ మాత్రం చాలా సింపుల్‌గా ఉండటంతో అభిమానులకు మరింత నచ్చింది. ప్రస్తుతం తనకు ఈ ఆహార పదార్థాలపై ఎక్కువగా ఇష్టం ఉందని, భవిష్యత్తులో తన ఫుడ్ ప్రిఫరెన్స్ మారే అవకాశం ఉందని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం.
Samantha dosa4/5

సమంత దోశ

ఇక సమంత వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఇటీవల ఆమె మాతృత్వానికి సంబంధించిన వార్తలతో వార్తల్లో నిలిచింది. ఈ విషయంపై ఆమె అభిమానులతో పలు విషయాలను పంచుకుంటోంది. సోషల్ మీడియాలో తన రోజువారీ అనుభవాలు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల సమంత సీమంతం వేడుక కూడా ప్రత్యేకంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
 Samantha movies5/5

సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్

సినిమాల విషయానికి వస్తే సమంత చివరిగా మా ఇంటి బంగారం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం తీసుకున్న సమంత తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే ఆమె చెప్పిన ఇడ్లీ, పెరుగన్నం, దోశ డ్రీమ్ మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
TAGS:
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.