Sapana choudhary announced divorce: మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సప్నా చౌదరీ తన భర్తతో ఆరేళ్ల బంధంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పెళ్లికి ముందు తన మీద కన్పించిన ప్రేమ పెళ్లి తర్వాత లేదని వాపోయింది. అందుకు ఇక విడిపోదామని నిర్ణయించుకున్నట్లు చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
1/6
వీర్ సాహు, సప్న చౌదరీ డైవర్స్ వివాదం:
సమాజంలో ఇటీవల కొంత మంది దంపతులు ప్రతిచిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు. ఏ మాత్రం చిన్న గొడవ వచ్చిన కూడా గొడవలు పడి పెద్దది చేసుకుని డైవర్స్ వరకు వెళ్లిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చర్చించుకుని పరిష్కరించుకోకుండా ప్రతి దాన్ని పెద్దది చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్, మాజీ బిగ్ బాస్ కంటెస్ట్ంట్ సప్నా చౌదరీ తన భర్తతో వీర్ సాహుతో ఉన్న ఆరేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పుకుంది. ఈ క్రమంలో సప్నా చౌదరీ అభిమానులు షాక్ అవుతున్నారు.
2/6
వీర్ సాహు డైవర్స్ వివాదం:
హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్, డ్యాన్సర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సప్నాచౌదరికి, నటుడు వీర్ సాహులు ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. కొన్నినెలల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గొడవలు చోటు చేసుకున్నాయి.
3/6
హర్యానా సింగర్ విడాకులు:
ఇద్దరు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని గొడవలు పడేవారు. దీంతో ఇక లాభంలేదని భర్తతో డైవర్స్ తీసుకుంటున్నట్లు ఒక మీడియాలో సింగర్ కీలక ప్రకటన చేసింది. తమ మధ్య బేధాభి ప్రాయాలు ఎందుకు వచ్చాయో వీర్ సాహుకు మాత్రమే తెలుసని, దీన్ని బహిరంగంగా చెప్పుకొవాలని భావించట్లేదని ఈ భామ చెప్పుకొచ్చింది. కలిసి ఉండి రిలేషన్ బాగాలేనప్పుడు విడిపోయి దూరంగా ఉండటం బెటర్ అని ఎమోషనల్ అయ్యింది. పరస్పరం అంగీకారంతో ఇద్దరం ఈ నిర్ణయం తీసుకున్నామని సప్నా చౌదరీ చెప్పుకొచ్చింది.
4/6
సప్న చౌదరి విడాకుల వివాదం:
ప్రేమ అనేది కేవంలో శరీరంకు సంబంధిచిన అంశం కాదన్నారు. మగాళ్లు చాలా మంది ప్రాక్టికల్ గా ఉంటారని, కానీ మహిళలు ఎమోషన్ ఫీలింగ్స్ కు ప్రయారిటీ ఇస్తారని మాట్లాడింది.అయితే..మొదటి సంతానం తర్వాత వీరి పెళ్లి విషయం బైటకు వచ్చింది.
5/6
హర్యానా సింగర్:
ఒక కోడలిగా, తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వర్తించిన కూడా తనకు సరైన గుర్తింపు, తన ఆసక్తులను పట్టించుకోకుండా నెగ్లీజెన్సీగా చూశారన్నారు. దీంతో చాలా సార్లు కుంగిపోయినట్లు సింగర్ సప్పా చౌదరి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బైటకు వచ్చిన తర్వాత తనకు ఎంతో ఫెమ్ ఉండేదని, ఆ తర్వాత పెళ్లయ్యాక తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది.
6/6
సప్న చౌదరీ డైవర్స్ :
అందుకే కలిసుండటం కన్నా.. విడిపోవడం బెటర్ అని డైవర్స్ తీసుకుంటున్నట్లు సింగర్ సప్న చౌదరి చెబుతు ఎమోషనల్ అయ్యింది. ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు.మరోవైపు సింగర్ ప్రకటనతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.