Bollywood Actor: ఆస్తి విలువ రూ.2,490 కోట్లు తగ్గినా.. భారతీయ నటుల్లో సంపద పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా? హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026లో ఆయన నెట్ వర్త్ రూ.10,000 కోట్లుగా అంచనా వేశారు.
1/5
అత్యంత ధనిక భారతీయ నటుడు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మరోసారి భారతీయ సినిమా రంగంలో తన సత్తా చాటుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న నటుడిగా ఆయన మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. తాజాగా విడుదలైన హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం.. షారుక్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.10,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా.
2/5
ధనిక బాలీవుడ్ హీరోలు
అయితే గత ఏడాదితో పోలిస్తే షారుక్ ఆస్తుల విలువ తగ్గింది. 2025లో ఆయన సంపద దాదాపు రూ.12,490 కోట్లుగా అంచనా వేయగా.. ఈ ఏడాది అది రూ.10,000 కోట్లకు చేరింది. అంటే సుమారు రూ.2,490 కోట్ల మేర తగ్గింది. మార్కెట్ విలువల్లో వచ్చిన మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది.
3/5
షారుక్ ఖాన్ సంపద
షారుక్ ఖాన్ సంపాదన కేవలం సినిమాలపైనే ఆధారపడి ఉండదు. ఆయనకు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థతో పాటు క్రీడా రంగంలోనూ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సంబంధించిన వ్యాపార వాటా కూడా ఆయన సంపదలో కీలకంగా ఉంది. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, నిర్మాణ సంస్థ, ఇతర వ్యాపారాల ద్వారా షారుక్ భారీగా సంపాదిస్తున్నారు.
4/5
షారుక్ ఖాన్ నెట్ వర్త్ 2026
ఆస్తి విలువ తగ్గినప్పటికీ ఇతర భారతీయ నటులతో పోలిస్తే షారుక్ చాలా ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సుమారు రూ.4,000 కోట్ల సంపదతో తర్వాతి స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ రూ.3,000 కోట్లతో, హృతిక్ రోషన్ రూ.2,500 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
5/5
కింగ్ సినిమా
ఇక షారుక్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా కనిపించనున్నారు. ఈ సినిమా యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది. ‘కింగ్’ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత షారుక్ ఖాన్ సినిమాలతో పాటు ఆయన బ్రాండ్ విలువపై కూడా ఆసక్తి పెరగనుంది.