• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి స్పెషల్ ట్రైన్! కానీ ఆ రూట్లలో పలు రైళ్లు రద్దు!

విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి స్పెషల్ ట్రైన్! కానీ ఆ రూట్లలో పలు రైళ్లు రద్దు!

Written ByRenuka Godugu
Published: Oct 15, 2026, 07:47 AM IST|Updated: Oct 15, 2026, 07:52 AM IST
joinshare

విశాఖపట్నం రైల్వే ప్రయాణికులకు పండుగ నేపథ్యంలో భారీ శుభవార్త అందింది. వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటూ చర్లపల్లి నుండి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Special Train1/6

ప్రత్యేక రైలు

దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పటికే సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే, చర్లపల్లి నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ కొత్త ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
Charlapalli to Visakhapatnam2/6

చర్లపల్లి నుండి విశాఖపట్నం

ట్రైన్ నంబర్ 07067 చర్లపల్లి నుండి విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఈరోజు గురువారం రాత్రి 9 గంటలకు బయలుదేరి, రేపు శుక్రవారం అర్ధరాత్రి 12:05 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకుంటుంది.
festival special trains India3/6

పండుగ స్పెషల్ ట్రైన్

అదేవిధంగా, విశాఖపట్నం నుండి చర్లపల్లికి వెళ్లే ట్రైన్ నంబర్ 07068 స్పెషల్ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 16న శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం ఉదయం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
South Central Railway 4/6

దక్షిణ మధ్య రైల్వే

ఈ రైలు ప్రధానంగా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ వంటి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో మొత్తం 22 ఎల్‌ఎచ్‌బీ కోచ్‌లు ఉంటాయి.
train cancellations5/6

రైళ్లను రద్దు

ఇందులో రెండు జనరల్ సీటింగ్, ఒక జనరల్ సీటింగ్ కమ్ లగేజీ, ఒక మోటార్ కార్, నాలుగు సెకండ్ క్లాస్ ఏసీ, 8 స్లీపర్ క్లాస్, మిగిలినవి ఏసీ కోచ్‌లు కలిపి మొత్తం 22 కోచ్‌లు ఉన్నాయి. అయితే, సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఝార్సీగూడ రైల్వే యార్డులో పునరుద్ధరణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడమే కాకుండా, కొన్నింటి మార్గాలను మార్చారు.
Indian Railways latest news6/6

భారతీయ రైల్వే

కాబట్టి ప్రయాణం చేసే ముందు మీరు వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా చర్లపల్లి నుండి దర్భంగ అలాగే నాందేడ్ నుండి సంత్రగచ్చి, సత్తన్‌పల్లి నుండి నాందేడ్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు. అలాగే యశ్వంత్ పూర్ నుండి టాటానగర్ వెళ్లే రైలును మళ్ళించారు.
TAGS:
Indian Railways

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 15 నుంచి త్రికోణ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, బిగ్‌ జాక్‌పాట్‌!

అక్టోబర్ 15 నుంచి త్రికోణ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, బిగ్‌ జాక్‌పాట్‌!

2

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సరే.. మరి 12 వేల ప్రాథమిక పాఠశాలలు..3వేల అప్పర్ ప్రైమరీ స్కూళ్ల భవిష్యత్తేంటి?

3

గాడిద చెప్పిన భవిష్యత్తు...అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అని చెబుతున్న నీతి కథ..!!

4

4 ఏళ్ల ప్రేమకు ఒక్క రోజే ఆయువు! ఉదయమే పెళ్లి.. సాయంత్రానికే విడిపోయారు! అసలు ఆ ఒక్క రోజులో ఏం జరిగింది?

5

Telangana Power Cuts: విద్యుత్‌ కోతలపై తెలంగాణ సీఎం తీవ్ర ఆగ్రహం.. నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.