Prabhas House Tour: ప్రభాస్ అసలు సిసలు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పాలేమో. తన ఫ్లాప్ చిత్రాలతో కూడా వందల కోట్లు కొల్లగొడుతున్న ఒకే ఒక్కడు. ఎపుడు రెబల్ స్టార్ సంబంధించిన చిత్రాలేనా.. ఆయన వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది. డార్లింగ్ హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా.. చూడకపోతే.. మీరు ఓ లుక్కేయండి.
1/7
ఫ్రభాస్ హోం టూర్
Prabhas House Tour:ప్రభాస్.. ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ సంచలనం రేపుతున్నాడు. మన దేశంలో ఓ హీరో రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది ప్రభాస్ నుంచే మొదలైందని చెప్పాలి. ఔను.. రెబల్ స్టార్ ఇపుడు తెలుగు హీరో కాదు.. ప్యాన్ ఇండియా స్టార్. కాదు కాదు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన చిత్రాల కోసం ఎదరు చూసే అభిమానులు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత చిత్రాలతో కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతున్నారు.
2/7
ప్రభాస్ మూవీస్
ప్రభాస్.. ఈ యేడాది ‘ది రాజా సాబ్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. అంతకు ముందు ‘కల్కి 2898 ఏడి’ మూవీతో రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించారు.
3/7
ఇంద్ర భవనం
ఇక ఎపుడు ప్రభాస్.. సినిమాలు.. ఆయన ఎపుడు మ్యారేజ్ చేసుకుంటాడనే విషయాలు పక్కన పెడితే.. రెబల్ స్టార్ ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. నిజంగానే ఇంద్ర భవనమే అని చెప్పాలి. చూస్తే ఆశ్చర్యపోవడం అభిమానులతో పాటు ప్రేక్షకుల వంతు అవుతుంది.
4/7
మాహిష్మతి సామ్రాజ్యంలా ప్రభాస్ ఇళ్లు
ప్రభాస్ ఇల్లు కూడా.. బాహుబలి చిత్రంలో మాహిష్మతి సామ్రాజ్యంలా చూడటానికి రెండు కళ్లు చాలవు అని చెప్పాలి. ఈ ఇంటి కోసం దాదాపు రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. అందులో డెకరేషన్ కోసం మరో రూ. 10 కోట్ల వరకు ఖర్చు అయినట్టు ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట.
5/7
ప్రభాస్ అడ్రస్
లోపల వివిధ దేశాలకు చెందిన టైల్స్ తో చేసిన ఫ్లోరింగ్.. స్విమ్మింగ్ ఫూల్ వంటివి చూస్తే చూపు తిప్పుకోలేరు. స్విమ్మింగ్ ఫూల్ ఆరు బయట కాకుండా.. లోపల సీక్రెట్ గా ఉండటం విశేషం. ప్రభాస్ ఇంట్లో ఉండే గార్డెనింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఈయన ఇల్లు హైదరాబాద్, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 44, సీబీఐ కాలనీలో ఉంది. ఆ ఇంటిని మెయింటెన్స్ కోసం నెలకు దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందనేది సమాచారం.
6/7
ప్రభాస్ ఇళ్లు
ప్రభాస్ కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనే కాదు.. గండిపేటలో కూడా ఓ గెస్ట్ హౌస్ ఉంది. దాంతో పాటు సొంత ఊరులో కూడా తాతల కాలం నాటి ఇంద్ర భవనం ఉంది. దీంతో పాటు చెన్నై, బొంబాయి, బెంగుళూరు, లండన్, అమెరికా సహా దేశ విదేశాల్లో ప్రభాస్ కు సొంత విల్లాలున్నాయి. వీటి విలువే దాదాపు వేల కోట్ల విలువ చేస్తాయి.
7/7
ప్రభాస్ విల్లా
అంతేకాదు ప్రభాస్ తన ఇంట్లో ఉన్న లేకున్నా.. రోజు ఓ 50 మందికి వంట వండుతారట. దాన్ని తన సన్నిహితులకు పంపిస్తూ ఉంటారట. అంతేకాదు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎవరికీ తెలియకుండా గుప్త సహాయం చేయడం ప్రభాస్ నైజం అని ఆయన సన్నిహితలు చెబుతున్న మాట. ఏదైనా ప్రభాస్ నిజంగానే మనుసున్న రాజా సాబ్ అనే చెప్పడంలో అతిశయోక్తి అని చెప్పాలి.