• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Supritha Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లోకి హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..సురేఖా వాణి ఫ్యామిలీ నుంచి..!

Supritha Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లోకి హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..సురేఖా వాణి ఫ్యామిలీ నుంచి..!

Written ByHarish Darla
Published: Sep 15, 2026, 01:31 PM IST|Updated: Sep 15, 2026, 01:44 PM IST
joinshare
Supritha Bigg Boss 10 Wildcard: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రారంభమైన నాలుగు రోజులకే ఒక ఎలిమినేషన్..వారానికి ఇద్దర్ని ఇంటి నుంచి పంపిచేశారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 14 మంది సభ్యులు హౌస్‌లో ఉన్నారు. అయితే ఈ వారంలో 11 మంది నామినేషన్లలో నిలవడం వల్ల ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రముఖ నటి సురేఖా వాణి కుమార్తె ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

Supritha Bigg Boss 10 Wildcard: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రారంభమైన నాలుగు రోజులకే ఒక ఎలిమినేషన్..వారానికి ఇద్దర్ని ఇంటి నుంచి పంపిచేశారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 14 మంది సభ్యులు హౌస్‌లో ఉన్నారు. అయితే ఈ వారంలో 11 మంది నామినేషన్లలో నిలవడం వల్ల ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రముఖ నటి సురేఖా వాణి కుమార్తె ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. 

Bigg Boss 10 via a wild card entry1/7

సుప్రీత వైల్డ్ కార్డ్ ఎంట్రీ

ప్రస్తుతం సుప్రీత బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ టీమ్ సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి సుప్రీత ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి హంగామా మొదలవుతుందో చూడాలి.
supritha bigg boss 102/7

సుప్రీత వైల్డ్ కార్డ్ ఎంట్రీ

సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హీరోయిన్లకు మించి ఈ చిన్నదానికి నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తోనే ఆమె సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటికే రెండు సినిమాలు చేయగా, ఒక సినిమా విడుదలైంది, మరొకటి విడుదలకు సిద్ధంగా ఉంది.
Supritha Wild Card Entry3/7

సుప్రీత వైల్డ్ కార్డ్ ఎంట్రీ

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంత మంది కంటెస్టెంట్లను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. అందులో భాగంగా లేడీ కంటెస్టెంట్ల కోటాలో ఒక అందాల భామ ఎంట్రీ దాదాపు ఖాయమైందని టాక్ వినిపిస్తోంది. ఆ భామ మరెవరో కాదు.. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత.
Supritha Into Bigg Boss 10 Telugu4/7

సుప్రీత వైల్డ్ కార్డ్ ఎంట్రీ

ఈ వారం నామినేషన్లలో షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ ఉన్నారు. కేవలం అమన్, వంశీ, నరేష్ అనే ముగ్గురు సభ్యులు మాత్రమే నామినేషన్ల నుంచి తప్పించుకోగలిగారు. కేవలం ముగ్గురు తప్ప మిగతా వారందరూ నామినేషన్లలో ఉండటంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.
Bigg Boss 10 Telugu Wild Card5/7

సుప్రీత వైల్డ్ కార్డ్ ఎంట్రీ

అయితే, షో ప్రారంభమైన తొలి వారంలోనే హౌస్ నుంచి ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. మొదటి వారం మిడ్ వీక్‌లోనే చరణ్, చైత్ర ఎలిమినేట్ కావడం విశేషం. వీరి నిష్క్రమణ తర్వాత ప్రస్తుతం హౌస్‌లో 14 మంది సభ్యులు కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. సోమవారం జరిగిన నామినేషన్లలో ఏకంగా 11 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.
Bigg Boss 10 Telugu6/7

సురేఖా వాణి కూతురు

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ తమ ఆటపాటలు, వ్యూహాలతో తెగ సందడి చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో మొత్తంగా 16 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. వారిలో 10 మంది సెలబ్రెటీలు కాగా, ఆరుగురు కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Surekha Vani Daughter7/7

సుప్రీత

బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రారంభమైన నాలుగు రోజులకే ఒక ఎలిమినేషన్..వారానికి ఇద్దర్ని ఇంటి నుంచి పంపిచేశారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 14 మంది సభ్యులు హౌస్‌లో ఉన్నారు. అయితే ఈ వారంలో 11 మంది నామినేషన్లలో నిలవడం వల్ల ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రముఖ నటి సురేఖా వాణి కుమార్తె ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.
TAGS:
Bigg Boss

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.