The Traitors Contestants: తేజ సజ్జా హోస్ట్‌గా వస్తున్న ది ట్రైటర్స్ తెలుగు షోపై ఆసక్తి పెరుగుతోంది. చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి, విద్యుల్లేఖ రామన్ సహా మొత్తం 20 మంది సెలబ్రిటీలు ఈ మైండ్ గేమ్ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు.
1/5
ది ట్రైటర్స్ తెలుగు
టాలీవుడ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు కొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు హీరోగా సినిమాలతో ఆకట్టుకున్న ఆయన.. తొలిసారి హోస్ట్‌గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షో అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
2/5
ది ట్రైటర్స్ తెలుగు షో
ఇప్పటికే ఈ షో ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో కనిపించిన గేమ్, కంటెస్టెంట్ల మధ్య ఉండే పోటీ ఆసక్తిని పెంచుతోంది. మొత్తం 20 మంది సెలబ్రిటీలు ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు.
3/5
తెలుగు రియాలిటీ షో
ది ట్రైటర్స్ అనేది మైండ్ గేమ్ ఆధారంగా రూపొందిన రియాలిటీ షో. ఇందులో కంటెస్టెంట్లను రెండు వర్గాలుగా విభజిస్తారు. కొందరు ఇన్నోసెంట్స్గా, మరికొందరు ట్రైటర్స్గా ఉంటారు. అయితే ఎవరు ట్రైటర్స్ అనే విషయం అందరికీ తెలియదు. ట్రైటర్స్‌ను గుర్తించడం, వారి ప్లాన్స్‌ను అర్థం చేసుకోవడం ఇన్నోసెంట్స్‌కు పెద్ద సవాలుగా ఉంటుంది. నమ్మకం, అనుమానం, వ్యూహాలు, మోసం వంటి అంశాలు గేమ్‌లో కీలకంగా ఉంటాయి. అందుకే ప్రతి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండనుంది.
4/5
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ షోలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, నటుడు హర్షవర్ధన్, సీనియర్ నటి ప్రగతి, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖ రామన్ పాల్గొంటున్నారు. వీరితో పాటు నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్, ఎస్ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనంజయ్, ఫల్గుణి బంగేరా కూడా గేమ్‌లో కనిపించనున్నారు.
5/5
ది ట్రైటర్స్ తెలుగు రిలీజ్ డేట్
హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు హోస్ట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కొత్త బాధ్యత తనకు ఆసక్తికరమైన అనుభవమని ఆయన చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా రియాలిటీ షోను అందించడంపై తేజ సంతోషం వ్యక్తం చేశారు. ది ట్రైటర్స్ తెలుగు మొత్తం 10 ఎపిసోడ్లుగా రానుంది. అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తేజ సజ్జా హోస్టింగ్, 20 మంది సెలబ్రిటీల గేమ్‌తో ఈ షో తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.