• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడు ఘనంగా అంకురార్పణ ఘట్టం!

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడు ఘనంగా అంకురార్పణ ఘట్టం!

Written ByRenuka Godugu
Published: Oct 11, 2026, 07:19 AM IST|Updated: Oct 11, 2026, 07:24 AM IST
joinshare

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈరోజే అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 11, ఆదివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ నవరాత్రులకు ఆగమశాస్త్రం ప్రకారం అంకురార్పణతో శ్రీవారి వేడుకలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Tirumala Navaratri Brahmotsavam 20261/5

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2026

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలకు ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ నిత్య కళ్యాణం, పచ్చ తోరణంలా ఎప్పుడూ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. అయితే, నవరాత్రుల సందర్భంగా ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి.
TTD Ankurarpanam2/5

తిరుమల అంకురార్పణ

తిరుమలలో అక్టోబర్ 11న రాత్రి అంకురార్పణతో పాటు సేనాధిపతి ఉత్సవం మొదలవుతుంది. యాగశాలలో శాస్త్రోక్తంగా ఈ ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం అంకురార్పణ చేపట్టి నవధాన్యాలను మొలకెత్తిస్తారు. భూమండలం అంతా పాడిపంటలతో, పశుపక్షాదులతో సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ నవధాన్యాలను ఇలా చేస్తారు.
Sri Vari Navaratri Brahmotsavam3/5

శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

శ్రీవారి సర్వ సైన్య అధ్యక్షుడు అయిన శ్రీ విశ్వక్సేనుడు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన మాడవీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
Viswaksena Vahanam Tirumala4/5

విశ్వక్సేన ఉత్సవం తిరుమల

ఈ నవధాన్యాలను మొలకెత్తించేందుకు భూదేవిని ప్రసన్నం చేసుకుంటూ మేదిని పూజ కూడా నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. మట్టికుండలో పుట్టమను నింపి, నవగ్రహాల సంకేతంగా నవధాన్యాలను పోస్తారు. ఈ పద్ధతిలో నవధాన్యాలను తొమ్మిది రోజుల పాటు పెంచి, చివరి రోజున వాటిని వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ నిర్వహిస్తారు.
Tirumala Tirupati Devasthanam5/5

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమలలో అక్టోబర్ 11 నుంచి అంకురార్పణతో మొదలైన ఈ ఉత్సవాలు.. బంగారు తిరుచ్చి, పెద్దశేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, మోహిని అవతారం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, స్వర్ణ రథం, అశ్వవాహనం, చక్రస్నానంతో ముగియనున్నాయి.
TAGS:
Tirumala
Tirupathi

Trending

  • News
  • Photos
  • Videos
సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

2

టాలీవుడ్‌లో నెగెటివ్ ప్రాపగాండా.. కులం, ప్రాంతం పేరుతో విభజన ఎందుకు?

3

‘జైలర్ 2’ టికెట్ రేట్స్ హైక్స్.. తమిళనాడులో కంటే ఏపీ, తెలంగాణలోనే ఎక్కువ రేట్లు.. ఏంటి రాజా ఇది..!

4

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందా..? అసలేం జరగుతుంది..?

5

Kidnap Gang: బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పడుపు వృత్తిలోకి.. అతిపెద్ద గ్యాంగ్‌ అరెస్ట్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.